భారత్ కు ఊరటగా అమెరికా ఫలితాలు..! రష్యా చమురు నుంచి వీసాల వరకూ..!

అమెరికా కాంగ్రెస్ (US Congress) లోని రెండు సభలతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల పదవులకూ జరుగుతున్న మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళి తేలిపోయింది. కాంగ్రెస్ లోని రెండు సభలైన హౌస్, సెనేట్ రెండింటిలోనూ విపక్ష డెమోక్రాటిక్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘోర పరాజయంతో నేలచూపులు చూడాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ అవసరం అయిన చోటల్లా భారత్ మద్దతు తీసుకుంటూనే.. భారతీయులకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు పలు విషయాల్లో రూటుమార్చుకోవాల్సిన పరిస్ధితుల్ని ఈ ఎన్నికలు కల్పించాయి. వీటిలో రష్యా చమురు నుంచి, వాణిజ్య ఒప్పందం నుంచి హెచ్1బీ వీసాల వరకూ చాలానే ఉన్నాయి.

నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత భారత్ విషయంలో ట్రంప్ చాలా కరకుగా వ్యవహరించారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనకుండా అడ్డంకులు కల్పించారు. అయినా భారత్ మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగారు, అదనపు సుంకాలు విధించారు. చివరికి అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని తప్పించేందుకు మధ్యలో వెసులుబాట్లు కూడా కల్పించక తప్పలేదు. అలాగే సుంకాల విషయంలోనూ అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని అడ్డుపెట్టారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే భారీ సుంకాలు విధిస్తానని బెదిరించారు. మధ్యలో 50 శాతం వరకూ సుంకాలు విధించారు. ఆ తర్వాత అమెరికా కోర్టుల జోక్యంతో వెనక్కి తగ్గారు. అలాగే భారతీయులకు హెచ్1బీ వీసాలు ఇవ్వడం తగ్గించేశారు. భారతీయులకు హెచ్1 బీ వీసాలు ఇస్తున్న కంపెనీల్ని నిరుత్సాహపరిచేందుకు లక్ష డాలర్ల స్పాన్సర్ షిప్ ఫీజు విధించారు. మధ్యలో అక్రమ వలసదారులంటూ దేశ బహిష్కరణలు చేశారు.

US Midterm Elections Could a Democratic Blue Wave Impact India s Russian Oil Trade and H-1B Visa Ties
ప్రపంచవ్యాప్తంగా నియంతలకు కష్టకాలం-మళ్లీ పాత రూట్లోకి జనం..! సీజేపీ విశ్లేషణ..!
ప్రపంచవ్యాప్తంగా నియంతలకు కష్టకాలం-మళ్లీ పాత రూట్లోకి జనం..! సీజేపీ విశ్లేషణ..!


ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కాంగ్రెస్ లోని రెండు సభల్లోనూ డెమోక్రాట్లు ఊహించినదాని కంటే ఎక్కువగా భారీ ఆధిక్యాలు సాధిస్తున్నారు. దీంతో రేపు కాంగ్రెస్ కు చెప్పకుండా ట్రంప్ ఏ విషయంలోనూ ముందడుగు వేయలేని పరిస్ధితులు ఎదురుకాబోతున్నాయి. ముఖ్యంగా భారత్ లో వాణిజ్య డీల్ కు ట్రంప్ పెడుతున్న అడ్డంకుల విషయంలో డెమోక్రాట్ల ఆధిక్యం కలిగిన సెనేట్ ఆయన్ను అడ్డుకోవచ్చు. అయితే భారతీయ వ్యాపారులపై సుంకాలు భారీగా తగ్గే అవకాశాలు లేవు. అలాగే హెచ్1బీ వీసాల్ని ట్రంప్ అడ్డుకుంటున్న తీరుపై డెమోక్రాట్లు జోక్యం చేసుకోవచ్చు. అలాగే ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలోనూ ట్రంప్ వచ్చే రెండేళ్లలో దూకుడుగా ముందుకెళ్లకుండా బ్రేకులు వేయవచ్చు. దీంతో హెచ్1బీ వీసాలతో పాటు గ్రీన్ కార్డుల విషయంలో భారతీయులు పడుతున్న ఇబ్బందుల నుంచి కాస్త ఊరట దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+