పిఠాపురంలో కొత్త రాజకీయం, రెబల్స్ బిగ్ షాక్ - తెర వెనుక..!!
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. దాదాపు 95 శాతం మేర స్థానాలను దక్కించుకుంది. వైసీపీ కేవలం ఒక కార్పోరేషన్.. నాలుగు మున్సిపాల్టీలకు మాత్రమే పరిమితం అయింది. కాగా.. డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఫలితాలు ఉత్కంఠ పెంచాయి. ఇక్కడ రెబల్స్ ప్రధాన పార్టీల అభ్యర్ధులకు షాక్ ఇచ్చారు. కాగా, ఇప్పుడు గెలిచిన ఈ రెబల్స్ మద్దతు వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ గెలుచుకుంది. అయితే, ఇక్కడి ఫలితాలు మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఛైర్మన్ పీఠాన్ని అధికార జనసేన పార్టీ కైవసం చేసుకున్నా.. కౌన్సిలర్ వార్డుల్లో మాత్రం అనూహ్యంగా రెబల్ అభ్యర్థులు హవా చాటారు. ప్రధాన పార్టీల అధికారిక అభ్యర్థులకు గట్టి షాకిస్తూ ఏకంగా పది మంది స్వతంత్రులు విజయం సాధించడం సంచలనంగా మారుతోంది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 36 వార్డులున్న పిఠాపురం మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందే 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. జనసేన 16 వార్డులు, టీడీపీ 5, బీజేపీ 1 వార్డును గెలుచుకున్నాయి.

రెబల్స్ రూటు ఎటు
అయితే, మున్సిపల్ పీఠం జనసేన దక్కించుకున్నా.. రెబల్ అభ్యర్థులకు ఓటర్ల ఆదరణ దక్కింది. మొత్తం 10 వార్డుల్లో స్వతంత్రులు ఘన విజయం సాధించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. 17, 21, 31, 34 వార్డులలో జనసేన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచి తిరుగులేని విజయం సాధించారు. 8, 9, 33, 36 వార్డులలో టీడీపీ టికెట్ దక్కని నాయకులు స్వతంత్ర అభ్యర్దులుగా గెలవగా.. 1, 18 వార్డులలో వైసీపీ రెబల్ అభ్యర్థులు గెలుపొంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మరే మున్సిపాలిటీలో లేని విధంగా, కేవలం పిఠాపురంలోనే ఇంత పెద్ద సంఖ్యలో స్వతంత్రులు నెగ్గడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ రెబల్స్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. పార్టీ నిర్ణయాలను కాదని రెబల్స్ గా పోటీ చేసిన వీరిని తిరిగి పార్టీలో క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకం. దీంతో.. ఇప్పుడు పిఠాపురం మున్సిపల్ ఫలితం రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది.













Click it and Unblock the Notifications
