పూరీ సినిమా రెడీ.. రిలీజ్ డేట్ మాత్రం నో క్లారిటీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన నూతన చిత్రం 'స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్'. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, సంయుక్త, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
తాజాగా నటి టబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్లతో సినిమాపై మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైనప్పటికీ.. చిత్ర థియేట్రికల్ విడుదల తేదీపై మాత్రం చిత్రనిర్మాతలు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్టోబరులోనే పూర్తయిన షూటింగ్
ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం చిత్రీకరణ అక్టోబర్ నెలలోనే పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తామని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గతంలోనే వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. థియేటర్లలోకి సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి.. వ్యాపారంలో చిక్కులు?
ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనలో ఆలస్యానికి పూరీ జగన్నాథ్ మునుపటి సినిమాలైన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' సాధించిన పరాజయాలు, వాటి వల్ల వచ్చిన ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సినిమాల వల్ల తీవ్ర నష్టాలు చవిచూసిన పంపిణీదారులు తమ నష్టపరిహారాల నిమిత్తం సెటెల్మెంట్లు చేయాలని ఒత్తి తెస్తున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక వివాదాల కారణంగానే నూతన ప్రాజెక్ట్ థియేట్రికల్ బిజినెస్‌లో అడ్డంకులు ఎదురవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఓటీటీ, థియేట్రికల్ డీల్స్‌లో ప్రతిష్టంభన
మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు, ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్స్ క్లోజ్ చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఆశిస్తున్న ధరకు, కొనుగోలుదారులు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇస్తున్న ఆఫర్లకు మధ్య పెద్ద తేడా ఉండటంతో ఈ ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఈ ఆర్థిక సమస్యలు, డీల్స్‌లో ఆలస్యంపై నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ.. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంలో జరగుతున్న ఆలస్యం 'స్లమ్‌డాగ్-33 టెంపుల్ రోడ్' విడుదలపై పలు అనుమానాలకు దారితీస్తోంది.














Click it and Unblock the Notifications
