భారత్ ను వదల బొమ్మాలీ అంటున్న డోనాల్డ్ ట్రంప్.. మరో భారీ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ సుప్రీంకోర్టు నుండి ఎదురు దెబ్బ తగిలినా సరే ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా భారత్ ను అసలే విడిచిపెట్టటం లేదు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత సోలార్ రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నా, 'మధ్యంతర వాణిజ్య ఒప్పందం' ఇంకా అమలు కాకముందే ఈ ప్రకటన వెలువడింది.
సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం
భారత్ నుంచి దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులకు ఊహించని షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్ లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ట్రంప్ ఊహించని నిర్ణయాలను తీసుకుంటున్నారు.

బలమైన కారణాలను చెప్పిన అమెరికా వాణిజ్య శాఖ
తాజాగా విధించిన ఈ భారీ టారిఫ్‌లకు అమెరికా వాణిజ్య శాఖ బలమైన కారణాలను చూపింది. భారత ప్రభుత్వం దేశీయ సోలార్ తయారీదారులకు ఇచ్చే 'ఫారిన్ సబ్సిడీలు' అన్యాయమైనవని, దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత ప్యానెళ్లు తక్కువ ధరకు లభిస్తున్నాయని అమెరికా వాణిజ్య శాఖ ఆరోపించింది. ఇది 'డంపింగ్’గా పేర్కొంటూ, స్థానిక కంపెనీలను రక్షించుకోవడమే తమ ప్రాధాన్యతని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
భారత్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం.. సోలార్ కంపెనీల షేర్లు పతనం
కేవలం భారత్‌పైన మాత్రమే కాకుండా, ఇండోనేసియాపై 143%, లావోస్ పై 81% ఇదే తరహా సుంకాలు విధించడం గమనార్హం. ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌పై తక్షణమే ప్రభావం చూపింది. అమెరికాకు ఎగుమతులు చేసే వారీ ఎనర్జీస్ 11%, సోలెక్స్ ఎనర్జీ 8%, ప్రీమియర్ ఎనర్జీస్ 6% వంటి ప్రముఖ సోలార్ కంపెనీల షేర్లు నిన్న భారీగా పతనమయ్యాయి.
సోలార్ రంగంలో దూసుకుపోతున్న భారత్ కు షాక్
సోలార్ రంగంలో దూసుకుపోతున్న భారత్‌కు, తాజాగా సోలార్ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా విధించిన సుంకం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ట్రంప్ భారత్ కు పదే పదే ఇస్తున్న షాకులు మాత్రం టారిఫ్ ల విషయంలో ఆందోళనలను కారణం అవుతుంది.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications