యూఎస్ ఘటన: బాధ కలిగించిందన్న భారత ప్రధాని మోడీ , ఇది అగ్రరాజ్యానికి అవమానమన్న బ్రిటీష్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో యూఎస్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నూతన ప్రెసిడెంట్ గా డెమోక్రాట్ జో బిడెన్ ఎన్నికను ధృవీకరించే సమావేశాన్ని అడ్డుకున్నారు ట్రంప్ మద్దతుదారులు . క్యాపిటల్ భవనంలోకి విధ్వంసం సృష్టించారు ఈ ఆందోళనల సందర్భంగా చెలరేగిన కాల్పులలో ఓ మహిళ మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చైనాకు గట్టి షాకిచ్చిన ట్రంప్ .. చైనీస్ కంపెనీలకు యూఎస్ లో చెక్ పెట్టే బిల్లుతో మరో ట్రేడ్ వార్

అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలన్న మోడీ
అమెరికాలో తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.
వాషింగ్టన్ లో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలు బాధ కలిగించాయి అన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియ ను ఆటంకపరచటం సరికాదని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ అణచివేయడానికి అనుమతించలేమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

అగ్రరాజ్యం అమెరికా తాజా పరిస్థితికి అందరూ షాక్
వాషింగ్టన్ డి.సి లో అల్లర్లు, కొనసాగుతున్న హింస గురించి వార్తలు రావడం చాలా బాధగా ఉందని పేర్కొన్న, మోడీ క్రమబద్ధమైన శాంతియుతమైన విధానం ద్వారా అధికారి బదిలీ జరగాలని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రముఖులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. అగ్ర దేశమైన అమెరికా లో ఏర్పడిన గందరగోళానికి ప్రతి ఒక్కరు షాక్ వ్యక్తం చేస్తున్నారు.
ఇక వాషింగ్టన్ డి.సి లో తాజా పరిణామాలపై బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా స్పందించారు.

యూఎస్ కాంగ్రెస్ లో ఇవి అవమానకరమైన దృశ్యాలు : బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్
యూఎస్ కాంగ్రెస్ లో ఇవి అవమానకరమైన దృశ్యాలు అన్నారు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం ముందువరుసలో ఉంటుందని, అలాంటి చోట శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా అధికారాన్ని బదిలీ చేయడం చాలా ముఖ్యమైన ప్రక్రియ అని బోరిస్ జాన్సన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి యూఎస్ ప్రస్తుతం తాజా పరిణామాలతో రగులుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని ఆందోళనకర పరిస్థితులు యూఎస్ లో ఉన్నాయి

ప్రపంచమే షాక్ అయ్యేలా ట్రంప్ మద్దతు దారుల విధ్వంస కాండ
అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ , ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ ఎన్నికల విజయాన్ని ధ్రువీకరించడానికి చట్ట సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కిస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఒక్కసారిగా బారికేడ్లను దాటి యుఎస్ క్యాపిటల్ భవనం లోనికి వెళ్లి అల్లర్లు చేయడం, కిటికీలను ధ్వంసం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం యూఎస్ రాజకీయాలలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.ఈ అల్లర్లలో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు .