escape: విద్యార్థిని గ్యాంగ్ రేప్, పోలీసు రివాల్వర్ లాక్కొని హంగామా, కాల్చిపారేస్తే, పోటుగాడు!
మీరట్: విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయిన కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచడానికి వెలుతున్న సమయంలో కేటుగాళ్లు పోలీసుల రివాల్వర్ లాక్కొని హంగామా చేస్తూ ఖాకీల మీద కాల్పులు జరిపారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిందని తేరుకున్న పోలీసులు మరో తుపాకికి పని చెప్పి కాల్చిపారేయడంతో కామాంధుల శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. దెబ్బకు మిగిలిన కామాంధులు ప్రాణభయంతో మాయం అయిపోయారు.

ఆ రోజు ఏం జరిగిందంటే ?
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఏప్రిల్ 1వ తేదీన మద్యాహ్నం ట్యూషన్ కు వెలుతున్న 16 ఏళ్ల వయసు ఉన్న 10వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై అత్యాచారం చేశారు. రెండు గంటలపాటు ఒకరి తరువాత ఒకరు అమ్మాయిపై రేప్ చేసి చివరికి ఆమెకు బలవంతంగా విషం తాపించి చంపేయడానికి ప్రయత్నించారు.

డెత్ నోట్ రాసి ఆత్మహత్య ?
సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వెళ్లిన విద్యార్థిని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి డెత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటున్నారు. గ్యాంగ్ రేప్ కు గురైన విద్యార్థిని తన మీద లఖన్, వికాస్ తో పాటు మరో ఇద్దరు గ్యాంగ్ రేప్ చేశారని రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది.

కామాంధులు అరెస్టు
మీరట్ పోలీసులు గ్యాంగ్ రేప్, అమ్మాయి ఆత్మహత్య చేసు దర్యాప్తు చేసి లఖన్, వికాస్ అనే నిందితులను పట్టుకున్నారు. నిందితులను విచారణ చేసిన మీరట్ పోలీసులు మరో ఇద్దరు కామాంధుల వివరాలు, వాళ్లు ఎక్కడ ఉన్నారు అనే పూర్తి సమాచారం బయటకు లాగాలని ప్రయత్నించారు.

పోలీసులకు సినిమా
లఖన్, వికాస్ ను విచారణ చేసిన పోలీసులు ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరయడానికి పోలీసు జీపులో పిలుచుకుని బయలుదేరారు.. ఆ సమయంలో పోలీసుల రివాల్వర్ లాక్కొన్న నిందితులు పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దెబ్బతో హడలిపోయిన పోలీసులు నిమిషంలో తేరుకుని నిందితుల మీద మరో తుపాకులతో కాల్పులు జరిపారు.

బుల్లెట్ రుచితో హడల్
పోలీసుల తూటా నిందితుడు లఖన్ కాలిలో దూసుకుపోయాయి. బుల్లెట్ గాయాలు కావడంతో కుప్పకూలిన లఖన్ తో పాటు పారిపోవడానికి ప్రయత్నించిన మరో నిందితుడు వికాస్ ను పోలీసులు పట్టుకున్నారు. మీరట్ లోని ఆసుపత్రిలో లఖన్ కు చికిత్స చేయిస్తున్నామని పోలీసులు అన్నారు. తప్పించుకున్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరపడం మీరట్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications