యూపీ పోరులో వ్యూహం మార్చిన ఎంఐఎం- 27 మందిలో నలుగురు హిందువులకు టికెట్లు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన ఎంఐఎం ఈసారి తనదైన వ్యూహాల్ని అమలు చేస్తోంది. యూపీ పోరులో మొత్తం 27 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎంఐఎం... అందులో నలుగురు హిందువులకు కూడా టికెట్లు కేటాయించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకూ మతం ఆధారంగా రాజకీయాలు చేసిన ఎంఐఎం... యూపీ వంటి రాష్ట్రంలో హిందువులకు టికెట్లు ఇచ్చి మరీ బరిలోకి దింపుతుండటం బీజేపీకి లాభిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
ఎంఐఎం ఇప్పటివరకూ తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు హిందూ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. వీరిలో ఘజియాబాద్ లోని సాహిబాబాద్ సీటు నుంచి పండిట్ మన్మోహన్ ఝా, ముజఫర్ నగర్ పరిధిలోకి వచ్చే బుధానా సీటు నుంచి భీమ్ సింగ్ బల్యాన్, మీరట్ లోని హస్తినాపూర్ సీటు నుంచి వినోద్ జాతవ్, బారాబంకిలోని రామ్ నగర్ నుంచి వికాస్ శ్రీవాస్తవ పోటీ చేయబోతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక తప్పేలా లేదు. దీనిపై స్పందించిన ఎంఐఎం నేతలు.. తాము మతం ఆధారంగా టికెట్లు ఇవ్వబోమని చెప్తున్నారు.

Recommended Video
గతంలో ముస్లింలను బరిలోకి దించడం ద్వారా సెక్యులర్ పార్టీల ఓట్లు చీలుస్తోందనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఈసారి.. హిందూ అభ్యర్ధుల్ని పోటీలో పెట్టడం ద్వారా ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో హిందూ అభ్యర్ధుల్ని రంగంలోకి దింపడం ద్వారా ఎంఐఎం ఏ మేరకు లబ్ది పొందుతున్నదానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో ఎంఐఎం పోటీ ఎవరికి లాభిస్తుందన్న దానిపైనా విస్తృత చర్చలు సాగుతున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications