పాలు తాగి చిన్నారి మృతి, కొద్దిసేపటికే తల్లి కూడ మృతి, ఏమైందంటే?

లక్నో: తల్లికి పాము కరిస్తే రెండున్నర ఏళ్ళ చిన్నారి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. కూతురు మరణించిన కొద్దిసేపటికే తల్లి కూడ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా మాండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఓ మహిళ తన ఇంట్లో నిద్రపోతుండగా ఆమెను పాము కాటేసింది. అయితే ఆ విషయాన్ని ఆమె గుర్తించలేదు..

Uttar Pradesh Child Dies From Mothers Snake Bite Breast Milk

అయితే ఆమె తన రెండున్నర ఏళ్ల కూతురికి పాలు ఇచ్చింది. ఈ పాలు తాగిన వెంటనే బిడ్డ పరిస్థితి విషమంగా మారింది. దీంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి ఆరోగ్యంలో కూడ మార్పులు చోటు చేసుకొన్నాయి.

కూతురు మరణించిన కొద్దిసేపటికే తల్లి కూడ మరణించింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటూనే తల్లి, కూతుళ్ళు మరణించారు. ఆసుపత్రికి చేరుకొనేసరికి తల్లి శరీరమంతా విషమయంగా మారింది. చికిత్స చేస్తున్నా ఆమె శరీరం సహకరించలేదు.

దీంతో ఆమె కూడ మరణించిందని వైద్యులు ప్రకటించారు. పాటు కాటుకు గురైన తల్లి, కూతుళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

అయితే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాతే తల్లి పాము కాటుకు గురైన విషయాన్ని ఆ కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో ఇంట్లో పామును వెతికారు. అయితే పాము ఇంట్లోని మరో గదిలో ఉంది. అయితే దాన్ని చంపేందుకు ప్రయత్నించగా అది తప్పించుకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+