Yogi Adityanath : మతం అంటే ఇదీ.. కొత్త నిర్వచనం ఇచ్చిన యోగీ ఆదిత్యనాథ్.
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అదే సమయంలో ఆధ్యాత్మికంగానూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో అభివృద్ధి, సమాజానికి మతంతో ఎలాంటి లింక్ ఉందో చెప్పేందుకు ఆయన తాజాగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో యోగీ.. మతానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. మతంతో పాటు సనాతన ధర్మం గొప్పతనాన్ని యూపీ సీఎం గుర్తుచేశారు.
యూపీలోని మహరాజ్ గంజ్ లోని చౌకీ బజార్ లో ఉన్న గురు గోరఖ్ నాథ్ ఆలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన మతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పౌర బాధ్యతలను నిర్వర్తిస్తుందని యోగీ వెల్లడించారు. మనమంతా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే భారత్ ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతుందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.

భారత్ లో సనాతన ధర్మం, మతం గురించి కూడా యోగీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో సనాతన ధర్మం మానవత్వం గురించి చెబుతోందన్నారు. భారత్ లో ఎన్నో మతాలు వచ్చాయి, పోయాయని, కానీ సనాతన ధర్మం మాత్రం అలాగే నిలిచి ఉందని యోగీ గుర్తుచేశారు. మతం అంటే కేవలం పూజలు చేస్తే సరిపోదని, పౌర విధులు నిర్వర్తించినప్పుడే అసలు మతం అవుతుందన్నారు.
మహారాజ్ గంజ్ లో బీజేపీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి పనులకు కూడా వీటిని యోగీ లింక్ చేశారు. ప్రభుత్వం మహారాజ్ గంజ్ లో చేపడుతున్న అభివృద్ధి పనుల్ని కాపాడుకున్నప్పుడే మతాన్ని కూడా కాపాడుకున్నట్లు అవుతుందని యోగీ గుర్తుచేశారు. ప్రభుత్వం తమ జేబులో నుంచి సంక్షేమానికి నిధులు ఇవ్వదని, ప్రజలు కడుతున్న పన్నులతోనే అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications