రేపు యూపీలో ఐదో దశ పోరు :అయోధ్యపై బీజేపీ ఆశలు-మండల్, కమండల్ పాలిటిక్స్ తో ఎస్పీ
ఉత్తర్ ప్రదేశ్ లో రేపు జరగనున్న ఐదో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ దశలో 11 జిల్లాల్లోని 60 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు దశల పోరులో భాగంగా జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు మాత్రం అలాగే ఉంది. ఈ దశలో బీజేపీ కొత్త అయోధ్య అంశంతోనూ, ఎస్పీ మండల్-కమండల్ పాలిటిక్స్ పైనా ఆధారపడుతున్నాయి.
Recommended Video
ఐదవ దశ ఎన్నికల్లో భాగంగా 11 జిల్లాల్లోని 60 స్థానాలతో పాటు అయోధ్య నియోజకవర్గంలోనూ రేపు ఓటింగ్ జరుగుతుంది. 2017లో వీటిలో 48 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది.అయితే, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 42 స్థానాలను కైవసం చేసుకుంది. 2017 నుంచి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నందున, 'అయోధ్య' కూడా ఎన్నో మార్పులకు గురైంది. గతంలో ఫైజాబాద్ అని పిలిచే ఈ జిల్లాకు అయోధ్యగా పేరు మార్చారు. బుందేల్‌ఖండ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ, సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా, చిత్రకూట్‌లలోనూ రేపు పోలింగ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో అయోధ్య అంశాన్ని ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ వాడుకుంటోంది. అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ ను పోటీ చేయంచకూడదని బిజెపి తీసుకున్న నిర్ణయంతో రామమందిరానికి సంబంధించిన హిందుత్వ చుట్టూ ఉన్న ఉత్సాహం చాలా తగ్గిపోయినప్పటికీ, రామ మందిర నిర్మాణం జిల్లాలోనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేస్తుందని బీజేపీ భావిస్తోంది.
మరోవైపు ఐదో దశ ఎన్నికలు జరిగే బెల్ట్‌లో 'కమండల్'ను 'మండల్' అధిగమిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. ముస్లింలు, ఓబీసీల సంఘీభావంపై ఇక్కడ ఫలితాలు ఆధారపడతాయని అంచనా వేస్తోంది. శాంతిభద్రతలు, ఉచిత రేషన్ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడాన్ని బీజేపీ ప్రస్తావిస్తోంది. బీజేపీ అయోధ్యతో పాటు మిగతా అంశాల్లో చేస్తున్న కమండల్ రాజకీయాల్ని గతంలో మండల్ రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందిన వర్గాల ద్వారా అధిగమించేందుకు ఎస్పీ వ్యూహరచన చేస్తోంది.












Click it and Unblock the Notifications