యోగీ సొంతగడ్డపై రేపు యూపీ ఎన్నికల ఆరోదశ- బీఎస్పీ ఓట్ల చీలికపైనే బీజేపీ ఆశలు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది.ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తి కాగా.. ఇందులో బీజేపీ, ఎస్పీ మధ్య హోరా హోరీ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్ పూర్ సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగబోతోంది. దీంతో ఈ దశ బీజేపీతో పాటు యోగీకి కీలకంగా మారింది.
పశ్చిమ యూపీలో మొదలైన అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పూర్వాంచల్ గా పేర్కొనే తూర్పు యూపీలో అడుగుపెట్టాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్‌పూర్ తో పాటు దాని చుట్టు పక్కల నియోజకవర్గాలు ఈ దశలో పోలింగ్ కు సిద్ధమయ్యాయి. . సాంప్రదాయకంగా దళిత, వెనుకబడిన కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీఎస్పీ ప్రభావం కూడా ఎక్కువే. దీంతో బీఎస్పీ సాయంతో తాము ఆధిక్యం ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో వరుస ఎదురుదెబ్బలు తగిలినా, బీఎస్పీ సోషల్ ఇంజినీరింగ్ ఇప్పటికీ ఇక్కడ సజీవంగానే ఉందనే అంచనాలున్నాయి.

Recommended Video
10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఆరోదశ పోలింగ్ లో బలరాంపూర్, సిద్ధార్థనగర్, మహరాజ్‌గంజ్, ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్‌పూర్, డియోరియా ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ తూర్పు యూపీ నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉండాలని బిజెపి కోరుకుంటోది. ఇప్పటివరకు బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ద్విముఖ పోరుగా సాగిపోతున్న ఎన్నికల్లో తొలిసారి బీఎస్పీ ప్రభావం ఉన్న ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇక్కడ ముక్కోణపు పోరును కాషాయ దళం కోరుకుంటోంది. ముక్కోణపు పోరు జరిగి బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతే అది తమకు లాభిస్తుందని బీజేపీ అంచనా వేసుకుంటోంది.












Click it and Unblock the Notifications