వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎమ్మెల్యేకు చుక్కలు.. ఆస్తులు జప్తు చేయాలంటూ కోర్టు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యేకు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయన ఆస్తులు అటాచ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై మొత్తం 12 కేసులు నమోదు కాగా ముజఫర్‌నగర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు న్యాయస్థానం ఎమ్మెల్యే ఆస్తులు అటాచ్ చేయాలని ఆదేశించింది.

ఖైరానా ఎమ్మెల్యే నహిద్ హసన్‌పై పలు ఛీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు ఆయన పరారీలో ఉన్నారు. నహిద్ హసన్ కేసులకు సంబంధించి ముజఫర్‌నగర్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఆస్తులు అటాచ్ చేయాలని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తి. ఆ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆయన ఇంటికి వెళ్లి ఆస్తుల అటాచ్‌కు సంబంధించిన నోటీసులు అంటించారు.

గలీజు దందాలకు వాట్సాప్.. హైటెక్ వ్యభిచారం.. మందుబాబుల తతంగం..!గలీజు దందాలకు వాట్సాప్.. హైటెక్ వ్యభిచారం.. మందుబాబుల తతంగం..!

 uttar pradesh khairana mla nahid hasan facing problems with court

క్రిమినల్ పీనల్ కోడ్‌ సెక్షన్ 82 కింద ఎమ్మెల్యే నహిద్ హసన్ ఇంటికి నోటీసులు అంటించినట్లు శామ్లి జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఇప్పటివరకు ఆయనపై మొత్తం 12 కేసులు నమోదు కాగా.. ఈ నెల 5వ తేదీ వరకు కోర్టు ఎదుట హాజరు కావాలని గడువు ఇచ్చారు. అయితే ఆయన కోర్టుకు రాకపోవడంతో ఆస్తులు అటాచ్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. నహిద్ హసన్ తల్లి మాజీ ఎంపీ తబస్సుమ్ హసన్‌పై కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

English summary
Uttar pradesh Muzaffarnagar Court Ordered To attach Khairana MLA Nahid Hasan Properties due to he not attending the court in 12 cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X