ఫ్రెండ్‌గా మారిన పక్షి: ఎటువెళ్లినా వెంటే! అతడేం చేశాడంటే.? (వీడియో)

యూపీకి చెందిన ఓ వ్యక్తికి పక్షి స్నేహితుడిగా మారిపోయింది. అతడు ఎక్కడికెళ్లినా.. అతడి వెంటే వెళ్తోంది.

లక్నో: మనుషులతో ఎక్కువగా కుక్కలే స్నేహాన్ని కొనసాగిస్తుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఓ పక్షి.. మనిషితో స్నేహం చేస్తోంది. అతడు ఎక్కడికి వెళ్లినా.. అతని వెంట ఎగురుతూ వచ్చేస్తోంది. అయితే, ఇందుకు ఓ కారణం ఉంది. అతడు ఏడాది క్రితం గాయపడిన ఆ పక్షిని చేరదీసి.. నయం అయ్యే వరకు సేవలు చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై అభిమానం పెంచుకున్న ఆ పక్షి అతనికి, అతని కుటుంబానికి దగ్గరైంది. కుటుంబంలో ఓ వ్యక్తిగా మారిపోయింది.

గాయపడిన పక్షిని కాపాడిన ఆరీఫ్

గాయపడిన పక్షిని కాపాడిన ఆరీఫ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ జిల్లాకు చెందిన మొహమ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ పక్షికి గాయం కావడం చూసి దాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పక్షికి గాయం నయం అయ్యే వరకూ సేవలు చేశాడు. దానికి కావాల్సిన ఆహారం అందించాడు. ఈ క్రమంలో కొద్ది రోజులకు ఆ పక్షి పూర్తిగా ఆరోగ్యవంతంగా మారింది. దీంతో ఆరీఫ్.. ఆ పక్షిని బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో వదిలేశాడు.

తిరిగి మళ్లీ ఇంటికే.. అతడికి స్నేహితుడిగా మారిపోయిన పక్షి

తిరిగి మళ్లీ ఇంటికే.. అతడికి స్నేహితుడిగా మారిపోయిన పక్షి

అయితే, ఆ పక్షి మాత్రం తిరిగి ఆరీఫ్ ఇంటికి వచ్చి చేరింది. ఇలా పలుమార్లు జరిగింది. దీంతో ఆ పక్షిని కూడా ఆరీఫ్ తన ఇంటిలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో ఆరీఫ్ కుటుంబంలో కొంగజాతికి చెందిన ఈ పక్షి భాగస్వామురాలైంది. తమతోపాటు ఈ పక్షి కూడా తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా ఉంటోందని ఆరీఫ్ చెబుతున్నాడు. ఆ పక్షి తమతో స్నేహ బంధం మరింత పెంచుకుందని పేర్కొన్నాడు.

ఈ స్నేహం కలకాలం: ఆరీఫ్ వెంటే పక్షి షికార్లు

ఇక ఆరీఫ్ తన ద్విచక్ర వాహనంపై బయటికి ఎక్కడికి వెళ్లినా.. అతని వెంటే ఈ పక్షి కూడా వెళ్లేది. అతడ్ని ఫాలో అవుతూ గాలిలో ఎగురుతూ వచ్చేది. ఇదంతా చూసే వారికి కొంత వింత అనుభూతినిచ్చేది. కానీ, ఆరీఫ్ కు మాత్రం ఇది సాధారణంగా మారింది. స్థానికులు కూడా ఆరీఫ్, పక్షి స్నేహం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. కాగా, ఆరీఫ్ వెంట పక్షి వస్తూ ఉండటంకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి స్నేహం బాగుందని అంటున్నారు. నిజమైన స్నేహం కలకలం కొనసాగాలని కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+