లవ్ మ్యారేజ్: ఇద్దరు మహిళలు సజీవదహనం: చచ్చారా ? లేదా ? అంటూ!
లక్నో: ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్లిందని కక్ష పెంచుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు మహిళలను సజీవదహనం చేశారు. వివాహం చేసుకున్న మహిళతో పాటు ఆమె మరదలిని అతి దారుణంగా సజీవదహం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తిని హత్య చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నివాసం ఉంటున్న గులఫ్సా అనే యువతి, మొహమ్మద్ షబి అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లిని గులఫ్సా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. రెండేళ్ల క్రితం గులఫ్సా పెద్దలను ఎదిరించి మొహమ్మద్ షబీని పెళ్లి చేసుకుంది.

అన్నా, వదిన, సోదరి
మొహమ్మద్ షబి, గులఫ్సా అన్వాల్ గట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు మొహమ్మద్ షబి సోదరి షబనూర్ ఒకే ఇంటిలో నివాసం ఉంటోంది. శనివారం ఉదయం మొహమ్మద్ షబి నమాజ్ చెయ్యడానికి మసీదుకు వెళ్లాడు.

పెట్రోల్, కిరోసిన్ చల్లి
ఆ సమయంలో గులఫ్సా, ఆమె మరదలు షబనూర్ మాత్రమే ఇంటిలో ఉన్నారు. ఆ సందర్బంలో గులఫ్సా కుటుంబ సభ్యులు ఇంటిలో చొరబడి గులఫ్సా, ఆమె మరదలి మీద కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు.

చివరికి
స్థానికులు ఎవ్వరూ వారిని రక్షించడానికి అటు వైపు రాకుండా గులఫ్సా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తరువాత ఇద్దరూ సజీవదహనం అయ్యారని నిర్దారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి వచ్చిన మొహమ్మద్ షబి విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు పట్టించుకోలేదు
గతంలోనే మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మొహమ్మద్ షబి ఆరోపించాడు. ఇద్దరు మహిళల సజీవదహనం చేసిన కేసులో ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఒకరిని అరెస్టు చేశామని మొరాదాబాద్ జిల్లా ఎస్పీ ఆశిష్ శ్రీవాత్సవ మీడియాకు చెప్పారు.

పెళ్లి రోజు కేసు పెట్టంది
వివాహం చేసుకున్న సందర్బంలోనే గలఫ్సా తన కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉందని కేసు పెట్టారని జిల్లా ఎస్పీ ఆశిష్ శ్రీవాత్సవ మీడియాకు చెప్పారు. భార్య, సోదరి సజీవదహనం కావడంతో మొహమ్మద్ షబి షాక్ కు గురైనాడు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications