Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చార్ ధామ్ యాత్రీకులకు బిగ్ అలర్ట్..!!

Char Dham Yatra: దేశంలో చార్ ధామ్ యాత్ర సందడి కొనసాగుతోంది. దేవ భూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో వెలిసిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తోన్నారు. ప్యాకేజీ టూర్లకు డిమాండ్ ఏర్పడింది.

ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. ఈ నెల 10వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 12వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తుల సందర్శనార్థం తెరిచారు.

Uttarakhand impose ban on videography and making reels at Char Dham temples

మళ్లీ శీతాకాలం ఆరంభ సమయంలో అంటే నవంబర్ 12వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 14వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మూతపడతాయి. విపరీతమైన మంచు పడటం, ప్రతికూల వాతావరణం వల్ల సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఆయా ఆలయాల్లో భక్తులకు అనుమతి ఉంటుంది.

తొలి వారం రోజుల వ్యవధిలో 3,34,732 మంది భక్తులు చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకున్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. దీనితో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

వీఐపీల దర్శనంపై విధించిన నిషేధాన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడంపైనే తాము ప్రస్తుతం దృష్టి సారించామని, వీఐపీల రాక వల్ల ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు.

అలాగే- గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని నిషేధించినట్లు తెలిపారు. వీడియోలు తీయడంపైనా నిషేధం జారీ చేసినట్లు వెల్లడించారు. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు ఉన్నట్లు చెప్పారు.

చార్ ధామ్ యాత్రపై ఉద్దేశపూరకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+