వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి ఫైజర్ వ్యాక్సిన్‌ షరతులు- ప్రభావవంతమే కానీ- అక్కడే ప్రతిష్ఠంభన

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌వేవ్‌ ప్రభావం నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత కూడా వేధిస్తోంది. దీంతో కేంద్రం
విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఇదే క్రమంలో భారత్‌లో ప్రస్తుతం ప్రభావం చూపుతున్న కరోనా
వైరస్‌పై తమ వ్యాక్సిన్‌ అద్భుతంగా పనిచేస్తుందని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. దీని వాడకంపై కేంద్రంతో ఫైజర్ చర్చలు
జరుపుతోంది. త్వరలో ఫైజర్‌కు కేంద్రం భారత్‌లో వాడకానికి అనుమతి ఇస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం
సంతరించుకుంది.

 భారత్‌లో వైరస్‌పై ఫైజర్ వ్యాక్సిన్‌

భారత్‌లో వైరస్‌పై ఫైజర్ వ్యాక్సిన్‌


భారత్‌లో సెకండ్‌వేవ్‌లో ప్రభావం చూపుతున్న కరోనా వైరస్‌ వేరియంట్‌పై అమెరికా వ్యాక్సిన్‌ ఫైజర్‌ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు దీని
తయారీదారు ప్రకటించారు. కేంద్రంతో జరుపుతున్న పర్చల్లో ఈ మేరకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ సంస్ధ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం
భారత్‌లో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లతో సమానంగా ఫైజర్ వ్యాక్సిన్ కూడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఫైజర్
ప్రకటించుకుంది. దీంతో ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన చర్యల్ని ముమ్మరం చేసింది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ అనుకూలతలివే

ఫైజర్‌ వ్యాక్సిన్‌ అనుకూలతలివే


అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌ భారత్‌లో 12 ఏళ్లకు పైబడిన అందరికీ ఇవ్వొచ్చని దీని తయారీదారు కేంద్రానికి తెలిపారు. దీన్ని
నెలరోజుల పాటు నిల్వ చేసేందుకు కూడా అవకాశం ఉందని సంస్ధ తెలిపింది. అలాగే 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో నిల్వ
చేసేందుకు సైతం అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో భారత్‌లో పరిస్ధితులకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు కేంద్రానికి ఫైజర్
స్పష్టం చేసింది. భారత్‌లో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

జూలై-అక్టోబర్ మధ్య 5 కోట్ల డోసులు

జూలై-అక్టోబర్ మధ్య 5 కోట్ల డోసులు


భారత్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి కేంద్రం అనుమతి మంజూరు చేస్తూ మాత్రం జూలై నుంచి అక్టోబర్‌ మధ్య ఐదుకోట్ల డోస్‌లు
అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తయారీదారు హామీ ఇచ్చారు. అయితే ఇందుకు తమకు పలు అంశాల్లో మినహాయింపులు కావాలని
ఫైజర్‌ కోరుతోంది. అత్యవసర వాడకం సందర్భంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు చెల్లించే పరిహారం, ఇతర అంశాల విషయంలో కొన్ని
మినహాయింపులు ఇస్తే తాము హామీ ఇచ్చిన విధంగా ఈ ఐదు కోట్ల డోస్‌లు సరఫరా చేస్తామని ఫైజర్ చెబుతోంది.

Recommended Video

New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu
షరతులకు కేంద్రం తలొగ్గుతుందా ?

షరతులకు కేంద్రం తలొగ్గుతుందా ?

ఫైజర్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమని చెప్తున్న తయారీదారు తాము చెప్పిన షరతులకు
అంగీకరించాలని కేంద్రాన్ని కోరుతోంది. కేంద్రంతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన ఫైజర్‌ ప్రతినిధులు ఈ షరతులపైనే
పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లకు తాము ఎలాంటి
మినహాయింపులు ఇవ్వలేదని ఇప్పుడు ఫైజర్‌కు ఇస్తే వారు కూడా ఇదే డిమాండ్‌ చేస్తారని కేంద్రం వాదిస్తోంది. దీనిపై ఏదో ఒకటి తేలితే
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయం.

English summary
Pfizer has told the government its Covid vaccine shows "high effectiveness" against the India-dominant variant of the virus experts believe is behind the devastating second wave of infections and deaths in the country, sources told news agency PTI Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X