ఇదీ పరిస్థితి.. చిన్నారితో కలిసి తండ్రి, పీపీఈ కిట్ ధరించి మరీ
కరోనా మళ్లీ భయపెడుతోంది. కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక చిన్న పిల్లలు, వృద్దుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైరస్ సోకితే చాలు వారు ఆస్పత్రిలో గడపాల్సి వస్తోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన తండ్రి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన చిన్నారితో కలిసి పిడియాట్రిక్ వార్డులో ఉన్నారు. అయితే ఆయన పీపీఈ కిట్ ధరించి మరీ అక్కడ ఉన్నారు.
కరోనా సెకెండ్ వేవ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోరానా బారిన పడుతున్నవారిలో పిల్లల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గుజరాత్‌లోని వడోదరలోని ఒక ఆసుపత్రిలో పీడియాట్రిక్ కోవిడ్ వార్డులో తండ్రి పీపీఈ కిట్ ధరించి, పిల్లవాడితో పాటు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు పిల్లలల దగ్గర ఉంటేనే వారు సరిగా చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటివరకూ చిన్నారులలో ఇమ్యూనిటీ పవర్ కారణంగా వారికి కరోనా సోకడం లేదని భావిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి.

పిల్లలు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్న తరుణంలో వారి తల్లిదండ్రులు ఆసుపత్రుల్లో పిల్లల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గుజరాత్‌లోని వడోదర ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజూ కనీసం నలుగురు కరోనా బాధిత చిన్నారులు అడ్మిట్ అవుతున్నారు. ఈ వైరస్ గతంలో మాదిరికన్నా ఇప్పుడు పిల్లలపై అధిక ప్రభావం చూపుతోందని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేష్ జోషి అన్నారు. కరోనా బాధిత చిన్నారులలో చాలామందికి చికిత్స అందించే సమయంలో ఆక్సిజన్ అవసరం అవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications