Vande Bharat Express : ఈసారి ఆవును గుద్దేసిన రైలు- మళ్లీ పగిలిన మూతి-గుజరాత్ లోనే

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైళ్లు భారత్ లో పరిస్ధితులకు ఫిట్ కావడం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే గుజరాత్ లోనే పలు రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖకు స్ధానిక పరిస్దితులు షాకిస్తున్నాయి. గుజరాత్ లోని అతుల్ లో ఇవాళ మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.

గాంధీనగర్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు అతుల్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. అడ్డంగా వచ్చిన ఓ ఆవును రైలు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవు చనిపోగా.. రైలు ముందు భారం తీవ్రంగా దెబ్బతింది. దీంతో దెబ్బతిన్న రైలు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నడుస్తున్న నాలుగు రైళ్లలో మూడు ప్రమాదాలకు గురయ్యాయి. గత నెల రోజుల వ్యవధిలో జరిగిన మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం ఇది. దీంతో వందే భారత్ రైళ్లలో ప్రయాణ భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Vande Bharat Express damaged after hitting cow in gujarat-third accident in a month

అతుల్ స్టేషన్ వద్ద ఆవును గుద్దేసిన తర్వాత 15 నిమిషాల పాటు అక్కడే రైలును నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ట్రాక్ క్లియర్ చేసి రైలును పంపారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రైల్వే ట్రాక్ లపై ఆవుల్ని, గేదెల్ని ఆపలేమని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే రైలును డిజైన్ చేసినట్లు తెలిపారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే 160 కిలోమీటర్ల వేగం అందుకునేలా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారుచేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+