100స్మార్ట్ సిటీలు: మంత్రి వెంకయ్య, ఏపికి ప్రాధాన్యం
హైదరాబాద్: దేశంలో వంద స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులతోపాటు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ మొదటి ప్రాధాన్యత ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనేనని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి తోపాటు, విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లాగే విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని అన్నారు. టౌన్ షిప్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. 2020 నాటికి దేశంలోని ప్రజలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు.

ప్రస్తుతం పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. దేశంలో 25శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని, 43శాతం మంది మెట్రో నగరాల్లో జీవిస్తున్నారని తెలిపారు. 2015 నాటికి దేశంలోని సగం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని వెంకయ్య నాయుడు అంచనా వేశారు. పట్టణాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. మెట్రో నగరాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. చెన్నై, బెంగళూరు, కొచ్చిలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
పట్టణాల్లోని యువత నైపుణ్యాభివృద్ధికి కూడా తగిని ప్రాధాన్యతనిస్తాయపి వెంకయ్య నాయుడు చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లోని ఇల్లు లేని వారికి ఆవాసాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరాలకు సుందరంగా తీర్చిదిద్దుతామని, అన్ని మతాలకు చెందిన పవిత్ర స్థలాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రధాన నగరాల్లో మెట్రో పనులు వేగవంతం చేస్తామని బాలకృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో జెన్ఎన్‌యుఆర్‌ఎం స్థానంలో కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పథకాల పేర్ల మార్పు చేయడం తమ పని కాదని చెప్పిన ఆయన, పని చేసుకుపోవడమే తమ కర్తవ్యమని అన్నారు.












Click it and Unblock the Notifications