షాకింగ్: తమిళనాట గాల్లోకి ఎగిరే పాము (వీడియో)

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో ఓ అరుదైన ఎగిరే పామును గుర్తించారు. కాలంపలయం గ్రామానికి చెందిన వెంకటేషన్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఆహారం కోసం గాల్లోకి ఎగురుతున్న పామును గుర్తించాడు.

Video: OMG! Rare flying snake rescued in Coimbatore

దీంతో ఆశ్చర్యపోయిన అతను స్థానికంగా ఉన్న పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చాడు. పామును అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని పరిశీలించారు. ఆ పాము అరుదైన క్రిసోపోలియా రకానికి చెందినదిగా గుర్తించారు.

వియత్నాం, కంబోడియా వంటి దేశాల్లో ఇలాంటి పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. బూడిద రంగులో ఉన్న ఈ పాము, నల్లటి మచ్చలతో ఉంది. ఒకేసారి 20 ఫీట్ల దూరం వరకు గాలిలోకి ఎగురుతుంది. అటవీ శాఖ అధికారులు దీనిని పుతుపతి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+