
వీడియో వైరల్: భార్యాభర్తల గొడవ, 9వ అంతస్తు నుంచి దూకిన మహిళ
లక్నో: ఓ మహిళ అపార్ట్‌మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. మహిళ కిందపడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ బస్ స్టేషన్ సమీపంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. మంగళవారం వీరి మధ్య గొడవ జరిగింది. సుమారు మూడు గంటలపాటు వారింటి నుంచి పెద్ద అరుపులు, శబ్దాలు వినిపించాయి. భర్తతో గొడవపడిన మహిళ ఆవేశం, మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది.

9వ ఫ్లోర్‌లోని బాల్కనీ నుంచి ఆ మహిళ దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే భర్త ఆమె చేయిని పట్టకుని పైకిలాగాడు. అయితే, పట్టుతప్పిన ఆమె అక్కడ్నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కిందికి వచ్చిన మహిళ భర్తను ఆమెను ఆస్పత్రికి తరలించాడు.
ग़ाज़ियाबाद में पति से झगड़े के बाद एक महिला ने 9वीं मंज़िल से छलांग लगाई,पति ने 3 मिनट तक हाथ पकड़कर रखा और शोर मचा दिया,शोर सुनकर नीचे लोगों ने गद्दे बिछा दिए,पकड़ कमजोर पड़ते ही महिला नीचे गिरी और गंभीर से घायल हो गई pic.twitter.com/6WPYzEMI3A
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 15, 2021
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ పరిస్థితి కొంత విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలను మహిళ భర్తను అడిగి తెలుసుకుంటున్నారు. బాధిత మహిళ కోలుకున్న తర్వాత ఆమె నుంచి మరిన్ని వివరాలను అడిగితెలుసుకోనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.