అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్ టీవీకే పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ టీవీకే పార్టీ.. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా 234 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు విజయ్. ఈ మేరకు ఇటీవల 234 మంది అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్య పరిచారు. విజయ్ సైతం రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో విజయ్ బరిలోకి దిగుతున్నారు.

అయితే విజయ్ నిలబెట్టిన 234 మంది అభ్యర్థుల్లో ప్రజలకు తెలిసిన నాయకులు కేవలం 15-20 మంది మాత్రమే ఉండటం గమనార్హం. మిగతావారంతా కొత్త వాళ్లే కావడంతో వాళ్లను గెలిపించే బాధ్యత విజయ్ తన భుజాలపై వేసుకున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఎన్నికల ప్రచారంలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

అయినా విజయ్ ఎన్నికల ప్రచారంలో భద్రతా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల విజయ్ పెరంబూర్ లో నామినేషన్ వేసిన తర్వాత అక్కడే ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొళత్తూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో తగినంత భద్రత లేకపోవడంతో పోలీసులు ఆ ప్రచారానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో విజయ్ అభిమానులు అసహనానికి లోనయ్యారు.

మరోవైపు తాజాగా విజయ్ ఎన్నికల ర్యాలీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ కారు నుంచి రోడ్డుకు ఇరువైపులా గుమికూడి ఉన్న వందలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ వస్తున్నారు. విజయ్ కారు చుట్టూ సెక్యూరిటీ ఉంది. అయితే రోడ్డు పక్కన నిల్చున్న ఓ వృద్ధుడు విజయ్ ను చూడగానే దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాడు.

Vijay Angered as Security Pushes Elderly Man Trying to Meet Him at Election Rally Vijay election

కానీ విజయ్ సెక్యూరిటీ ఆ వృద్ధుడ్ని నెట్టేసింది. దాంతో ఆ వృద్ధుడు కింద పడిపోయాడు. ఇది గమనించిన విజయ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. చూసుకోవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు తన ఎన్నికల ప్రచారంలో భద్రతా లోపాలు జరుగుతున్నాయని విజయ్​ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, హోం శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు.

తమిళనాడు పోలీసులు భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు విజయ్. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 న ఒకే దశలో జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 4 న జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+