భారత్‌కు రావాలని ఉంది, కానీ, పాస్‌పోర్ట్ ఇస్తేనే: మాల్యా
లండన్/న్యూఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి, దేశం విడిచి పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకొచ్చారు. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసు విచారణ నిమిత్తం ఆయన ఢిల్లీ కోర్టులో హాజరవాల్సి ఉండగా.. తాను రాలేనని మాల్యా తెలిపారు.
తన పాస్‌పోర్టు రద్దు చేశారని, దీని వల్ల తాను కోర్టుకు హాజరవలేకపోతున్నానని మాల్యా పాటియాలా హౌస్ కోర్టుకు తెలిపారు. అయితే తనకు భారత్‌కు తిరిగి రావాలని ఉందన్నారు. పాస్‌పోర్టు రద్దును వెనక్కి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.
కాగా, జులై 9న ప్రత్యక్ష హాజరు మినహాయింపును ఈ కోర్టు రద్దు చేయడంతో మాల్యా హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. విజయ్ మాల్యా పాస్‌పోర్టును ఈ యేడాది ఏప్రిల్ 23న రద్దు చేశారని, అందువల్లే అతడు హాజరుకాలేకపోతున్నాడని అతని తరపు న్యాయవాది కోర్టులో వివరించారు. ఈ మేరకు మాల్యా పంపిన ఈమెయిల్ కాపీని కూడా కోర్టులో అందజేశారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులకు దాదాపు రూ. 9వేల కోట్ల రుణాలు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ఈ ఏడాది మార్చిలో దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్యా లండన్‌లో ఉన్నారు.
మాల్యాపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. భారత్‌కు తిరిగి వచ్చివిచారణకు హాజరుకావాలని పలుమార్లు హెచ్చరికలు, నోటీసులు జారీ చేసినప్పటికీ మాల్యా వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో మాల్యా పాస్‌పోర్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.












Click it and Unblock the Notifications