వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెర్సల్ సినిమా మీద కేసు నమోదు, హిందువుల గురించి, బీజేపీకి థ్యాక్స్ చెప్పిన టీటీవీ దినకరన్ !

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు.

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ సినిమాలో డైలాగులు ఉన్నాయని బీజేపీ నాయకులు ఇప్పటికే ఆరోపించారు.

 Vijay Mersal in trouble a complaint filed against film for hurting Hindu sentiments

ఇప్పుడు మరో వివాదం తెర మీదకు వచ్చింది. మెర్సల్ సినిమాలో హీరో విజయ్ ప్రజలకు కావాల్సింది దేవాలయాలు కాదని, ఆసుపత్రులు అంటూ డైలాగులు చెప్పారు. హిందువులు దేవాలయాల్లో దేవుడిని భక్తితో పూజిస్తారని, అలాంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మదురైలో సోమవారం కేసు పెట్టారు.

హిందూ సంఘ, సంస్థకు చెందిన న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారాణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన టీటీవీ దినకరన్ సైతం మెర్సల్ సినిమా విషయంలో స్పంధించారు. మెర్సల్ సినిమాను బీజేపీ నాయకులు చాలా బాగా ప్రచారం చేస్తున్నారని, వారికి నా థ్యాక్స్ అంటూ ఆ పార్టీ నాయకులను ఎద్దేవ చేశారు.

English summary
Vijay’s new film Mersal has involved itself in a fresh controversy as a police complaint has been filed against the Tamil actor in Madurai for allegedly hurting Hindu sentiments in the movie. An advocate in Madurai has objected to a particular dialogue in Mersal, where Vijay says: “We don't need to build temples. We want hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X