Vijay vs Stalin: విజయ్-స్టాలిన్ లో ఎవరు కరెక్టో చెప్పేసిన ఆర్బీఐ..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ (Vijay) మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ₹10 లక్షల కోట్ల భారీ అప్పు భారాన్ని మిగిల్చారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా ఉందని, పారదర్శకత కోసం ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన స్టాలిన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మాటల యుద్దం (vijay vs stalin) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటాతో వీరిద్దరిలో ఎవరు కరెక్టో తేల్చేసింది.

సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్.. "మన తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులలో మిగిలిపోయిందో నాకు స్వయంగా అర్థమైంది. గత ప్రభుత్వం ₹10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లిపోయింది; వారు పదవి నుంచి దిగిపోయే లోపే ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తక్షణం తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న ఆరోపణలను వెంటనే ఖండించారు. ఎక్స్ లో చేసిన పోస్ట్ లో స్టాలిన్.. "ప్రభుత్వం వద్ద డబ్బు లేదని అప్పుడే చెప్పడం మొదలుపెట్టకండి, అది ఉంది, ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం ఉంటే చాలు" అని స్పష్టం చేశారు.

Vijay vs Stalin on Tamil Nadu Debt RBI Data Has the Final Answer

దీంతో తమిళనాడు అప్పు 10 లక్షలు కోట్లుగా పేర్కొన్న విజయ్ చెప్పింది తప్పా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ డేటా విడుదల చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి తమిళనాడు అప్పులు ₹9.56 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే అత్యధికం. ఈ అధికారిక గణాంకాలు ముఖ్యమంత్రి విజయ్ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. 2021లో కూడా ఇదే పరిస్ధితి కనిపించింది. అప్పట్లో డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక మంత్రి పి.త్యాగ రాజన్ శ్వేతపత్రం విడుదల చేశారు. దశాబ్దకాల అన్నాడీఎంకే పాలన తర్వాత తమిళనాడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఐదేళ్ల త్రరవాత విజయ్ కూడా అదే చేయబోతున్నారు.

Vijay vs Stalin on Tamil Nadu Debt RBI Data Has the Final Answer

ఆర్బీఐ డేటా ప్రకారం, 2025 ఆర్దిక సంవత్సరంలో తమిళనాడు అప్పు-రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) నిష్పత్తి 30.6 శాతంగా ఉంది. ఇది కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయి అయిన 2022 ఆర్దిక సంవత్సరంలో 32 శాతం కంటే తక్కువ. కాగా, పాత జీడీపీ సిరీస్ ప్రకారం, 2026 ఆర్దిక సంవత్సరంలో 10.8%, 2025 ఆర్దిక సంవత్సరంలో 11.2% వృద్ధి రేట్లను సాధిస్తూ, తమిళనాడు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సాధారణంగా బలమైన రుణాల తిరిగి చెల్లింపు సామర్థ్యం కారణంగా ఎక్కువ రుణాలను భరించగలవు. అయితే ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తావించిన ₹10 లక్షల కోట్ల రుణ భారం కేవలం గత డీఎంకే ప్రభుత్వం వల్లనే కాదని స్పష్టమవుతోంది. డీఎంకే ప్రభుత్వపు 2021 శ్వేతపత్రం కూడా రాష్ట్రం బలహీనమైన ఆర్థిక స్థితిలో ఉందని, ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పులు చేసిందని అంగీకరించింది. రాష్ట్ర అప్పులు అనేక సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాల హయాంలో క్రమంగా పెరిగాయని, కోవిడ్-19 కాలంలో గణనీయంగా పెరిగాయని ఆర్థిక సంఘం నివేదిక కూడా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+