విజయకాంత్‌కు అన్నాడీఎంకె షాక్: భార్యపై 'ఓటుకు నోటు' కేసు

చెన్నై: ప్రముఖ నటుడు, డిఎండికె చీఫ్ విజయ్ కాంత్ భార్య, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత పైన కేసు నమోదైంది. ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ఆమె ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు.

ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ... కొన్ని పార్టీలు ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారని, అలాంటి వారిని ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వమని అడగండంటూ ఓటర్లకు ఆమె చెప్పారు. దీంతో తిరునెల్వేలికి చెందిన అన్నాడీఎంకే నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vijayakant's wife booked for 'instigating' voters to accept

ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మే 16న జరగనున్నాయి. డిఎండికె నాలుగు పార్టీలతో కూడిన పిడబ్ల్యూఎఫ్ (పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో కలిసి బరిలో నిలిచింది. విజయకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+