వికసిత్ భారత్2047: వాయిస్ ఆఫ్ యూత్ ప్రారంభం: ప్రధాని మోడీ కీలక అడుగు!!
వికసిత్ భారత్ @ 2047 దార్శనికత సాకరం కోసం దేశ యువత ఆలోచనలను స్వీకరించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం ప్రారంభిస్తారు. దేశ ప్రధాని నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్@ 2047 వాయిస్ ఆఫ్ యూత్'ను ప్రారంభించనున్నారు.
వికసిత్ భారత్@ 2047 కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా రాజ్ భవన్ లలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లు, ఇన్స్టిట్యూట్ ల అధిపతులు, మరియు అధ్యాపక సభ్యులను ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఇస్తారు. దేశాభ్యున్నతికి చెందిన ప్రణాళికలలో యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

భారత ప్రధాని తీసుకునే ఈ చొరవ ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొంది. భారతదేశానికి సంబంధించిన జాతీయ ప్రణాళికలు, ప్రాధాన్యతలు, మరియు లక్ష్యాల రూప కల్పనలో యువ తరాన్ని చురుగ్గా భాగస్వామ్యం తీసుకునేలా చేయటమే ప్రధాని మోడీ దార్శనికత అని పీఎంవో కార్యాలయం తెలిపింది.
ఇది యువత తమ సృజనాత్మక ఆలోచనలను దేశానికి అందించటానికి, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చటానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ వర్క్ షాప్ ల ద్వారా యువత తమ ఆలోచనలను దేశం కోసం పంచుకోవచ్చని పేర్కొంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వారి ఆలోచనలు మరియు సూచనలను పంచుకోవడానికి యువకులను నిమగ్నం చేసే ప్రక్రియను ప్రారంభించే దిశగా ఇది కీలక అడుగుగా చెప్తున్నారు.
దేశం కోసం యువత ఆలోచనలను తీసుకునే ఈ కొత్త కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వాలని, యువత దృష్టి ఈ కార్యక్రమం ద్వారా దేశంపైకి మారుతుందని చెప్తున్నారు. మొత్తానికి యువతను దేశ ప్రగతిలో భాగస్వామ్యం చేసే దిశగా మోడీ తీసుకున్న ఈ చొరవ మంచిది అన్న అభిప్రాయం దేశ ప్రజల నుండి కూడా వ్యక్తం అవుతుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications