వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AGNIPATH : కేంద్రం అగ్నిపథ్ పథకం చిచ్చు-బీహార్లో రైళ్ల దహనం-రాళ్లు రువ్విన ఆందోళన కారులు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ బీహార్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు రైల్వేస్టేషన్లపై దాడులకు పాల్పడ్డారు. రైళ్లను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు సైన్యంలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగాలు కల్పించాలన్న కేంద్రం నిర్ణయాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైన్యంలోకి సైనికులను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన రెండు రోజుల తర్వాత, రక్షణ ఉద్యోగార్ధులు ఉద్యోగ భద్రత, పెన్షన్‌పై ఆందోళనలు చేయడంతో బీహార్, రాజస్థాన్‌లలో నిరసనలు చెలరేగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు జరగడంతో బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు. తీవ్ర నిరసనల మధ్య ఒక రైల్వే స్టేషన్‌లో రైలుకు నిప్పు పెట్టారు.

violent protests against centres agnipath scheme in bihar, stone pelting, stations burnt

అగ్నిపథ్ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో బీహార్‌లోని అరాలో రెండో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.బక్సర్ జిల్లాలో, 100 మందికి పైగా యువకులు రైల్వే స్టేషన్‌పై దాడి చేసి, పట్టాలపై చతికిలబడ్డారు, పాట్నాకు వెళ్లే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు 30 నిమిషాల పాటు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని చెదరగొట్టారు.

violent protests against centres agnipath scheme in bihar, stone pelting, stations burnt

అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో పలు చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు ఛాప్రా, నవడా, జెహనాబాద్ వంటి ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి టైర్లను కాల్చి నిరసన తెలిపారు. దీంతో ఆయా ఫ్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

English summary
violent protests prevailed in several railway stations in bihar against central govt's agnipath scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X