Viral News : అంబులెన్స్ డ్రైవర్ అరాచకం-దారిలోనే తాగి.. పేషెంట్ కూ తాగించి..
ఈ మధ్య ప్రతీ రాష్ట్రంలోనూ అంబులెన్స్ డ్రైవర్లపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో బాధితుల గురించి ఏమాత్రం పట్టిచుకోకుండా వేల రూపాయలు నిర్ధాక్షిణ్యంగా వసూలు చేయడం, డబ్బులివ్వకపోతే శవాల్ని సైతం వదిలేసి వెళ్లిపోవడం, ఆస్పత్రులకు రోగుల్ని తీసుకెళ్లకపోవడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెసిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
ఒడిశాలో ఓ అంబులెన్స్ డ్రైవర్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. తాజాగా ఓ రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్నాడు. అయినా తన సహజమైన అలవాటును వదులులేకపోయాడు. అంబులెన్స్ లోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నాననే విషయం అతను పట్టించుకోలేదు, అంతే కాదు తాగి డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదం గురించి కూడా ఆలోచించలేదు. దీంతో ఆ డ్రైవర్ తాగుతూనే వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఆస్పత్రికి వెళ్లేలోపు మరో దారుణం కూడా చేసేశాడు.

సగం దూరం వెళ్లాక దారిలోనే అంబులెన్స్ ను ఆపాడు. అంతే కాదు అంబులెన్స్ లో ఉన్న రోగికి సైతం మద్యం పెగ్గు పోశాడు. దీంతో ఆ రోగి కూడా దాన్ని సేవించాడు. అదే అంబులెన్స్ లో రోగి భార్యా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అయినా డ్రైవర్ కానీ, రోగి కానీ పట్టించుకోలేదు. దీంతో చుట్టుపక్కల ఉన్న స్ధానికులు కొందరు అక్కడికి చేరుకుని డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు.
In a shocking incident that took place in #Odisha #india ,a video of an ambulance driver drinking with a patient while on their way to hospital. In the video, the ambulance driver can be seen drinking and even sharing the drink with a patient. pic.twitter.com/gNJ07tECV6
— S a m (@cheguwera) December 20, 2022
ముందు వారి తిట్లకు ఏం చెప్పాలో అర్ధం కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ చివరికి జరిగిన విషయం చెప్పేశాడు. తాను తాగుతుంటే రోగి తనకు కూడా ఇమ్మని అడిగాడని, దీంతో ఓ పెగ్గు పోసి ఇవ్వాల్సి వచ్చిందని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో అప్పటివరకూ డ్రైవర్ పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్న స్ధానికులు కాస్తా అవాక్కయ్యారు. ఈ ఘటనను స్ధానికంగా ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications