వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: కూతురి పుట్టినరోజున లక్ష పానీపూరీలు పంచిన తండ్రి.. గ్రేట్ మెసేజ్ ఇచ్చారుగా!!

|
Google Oneindia TeluguNews

ఎవరైనా పిల్లలు పుట్టిన రోజు వేడుకలు అంటే చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతారు. లేదా స్వీట్లు పంపిణీ చేస్తారు. ఇంకా ఘనంగా అంటే బంధు మిత్రులను పిలిచి భోజనాలు పెట్టి వేడుక చేసుకుంటారు. కానీ మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని లక్ష పానీపూరీ లను ఉచితంగా పంపిణీ చేశాడు. తన చర్య ద్వారా ఆడపిల్లలపై వివక్ష లేని సమాజం కోసం మంచి సందేశాన్ని ఇచ్చారు.

కుమార్తె మొదటి పుట్టినరోజు నాడుఉచిత పానీపూరీ పంపిణీ చేసిన తండ్రి

కుమార్తె మొదటి పుట్టినరోజు నాడుఉచిత పానీపూరీ పంపిణీ చేసిన తండ్రి


మధ్యప్రదేశ్‌లోని కోలార్‌కు చెందిన ఒక పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్తా తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. గతేడాది ఆగస్టు 17న ఆంచల్ గుప్తాకు ఒక కుమార్తె పుట్టింది. ఆడపిల్ల పుట్టడంతో ఆ శుభవార్త విన్న తర్వాత తన చాట్ అందరికీ ఉచితంగా పంచి అప్పుడు కూడా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు తన కుమార్తె మొదటి పుట్టిన రోజు నాడు 1.01లక్షల ఉచిత పానీపూరీలను పంపిణీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక కుమార్తె పుట్టినరోజు నాడు సదరు తండ్రి పానీ పూరీలను పంచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

31 స్టాల్స్ లో ఉచితంగా పానీపూరీల పంపిణీ

31 స్టాల్స్ లో ఉచితంగా పానీపూరీల పంపిణీ

బంజరీ మైదాన్‌లో భారీ టెంట్‌ను ఏర్పాటు చేసి 31 దుకాణాల్లో ఉచితంగా పానీపూరీలను పంపిణీ చేశారు. ఆడపిల్లలను రక్షించండి, వారిని చదివించండి అనే సందేశాన్ని ప్రచారం చేసేందుకే ఈ తరహా ఉచిత పానీపూరీలను అందరికీ అందిస్తున్నట్టు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పాప తండ్రి అంచల్ గుప్తా తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ కూడా పాల్గొన్నారు. ఆడపిల్లల కోసం ఆంచల్ గుప్తా చేసిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసించారు.

కూతుళ్లతోనే భవిష్యత్తు ఉంటుందన్న పానీపూరీ వ్యాపారి

ఆడబిడ్డ పుట్టడంతో తన కల నిజమైందని, తనకు పెళ్లయినప్పటి నుంచి ఎప్పుడూ కూతురే కావాలి అని కలలు కన్నానని ఆంచల్ గుప్తా చెప్పాడు. కానీ తనకు మొదట కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ గత ఏడాది కుమార్తె పుట్టింది. దీంతో "బేటీ హై, తో కల్ హై" కూతుళ్లతోనే భవిష్యత్తు సాధ్యమవుతుంది అని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆడపిల్లల పట్ల వివక్ష తగదని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆడ, మగా సమానమే అన్న సందేశాన్ని ఇవ్వాలని ఈ పానీపూరీ పంపిణీ చేపట్టినట్టు చెప్పారు.

1,01,000 ఉచిత పానీపూరీల పంపిణీ చేసి ఆడపిల్లలపై సందేశం ఇచ్చిన తండ్రి

1,01,000 ఉచిత పానీపూరీల పంపిణీ చేసి ఆడపిల్లలపై సందేశం ఇచ్చిన తండ్రి


ఇప్పుడు 2022లో, కూతురు మొదటి పుట్టినరోజును పురస్కరించుకుని, పానీపూరి వ్యాపారి అయిన తండ్రి ప్రజలకు ఉచితంగా పానీపూరీ లను అందించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఒకరిద్దరు కాదు, వందల సంఖ్యలో జనాలకు లక్షకు పైగా పానీపూరీలు అందించి వార్తల్లో నిలిచాడు. 31 స్టాల్స్ ద్వారా సుమారు 1,01,000 ఉచిత పానీపూరీల పంపిణీ కుమార్తె పుట్టినరోజు గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆడపిల్లలను కాపాడాలనే సందేశాన్ని తాను ఈ ఉచిత పానీ పూరి పంపిణీ ద్వారా చెప్పాలనుకున్నానని ఆంచల్ గుప్తా చెప్తున్నారు.

English summary
Occassion of his daughter's birthday, the father set up 31 stalls and distributed more than one lakh panipuris. This video has now gone viral on social media. The incident took place in Kolar, Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X