ఫ్రెంచ్ ఫ్రైస్‌లా ఎముకలను నమిలిన జిరాఫీ
న్యూఢిల్లీ: మొన్నటికి మొన్న ఓ జింక- చనిపోయిన పామును తింటూ కనిపించింది. మాంసాహారం జోలికి వెళ్లని జింకలు.. చచ్చిన పామును తినడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఉదంతం.. సైన్స్‌కు సరికొత్త సవాల్‌ను విసిరిందని, ప్రకృతి తనలో దాచుకున్న ఓ రహస్యం వెలుగులోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు సరిగ్గా అలాంటి ఉదంతమే మరొకటి బయటపడింది. జింకల్లాగే హెర్బివర్ జాతికి చెందిన ఓ జిరాఫీ- ఎముకలను నములుతూ కనిపించింది. అడవి దున్న కళేబరం నుంచి బయటికొచ్చిన రెండు ఎముకలను నోట కరచుకుని వాటిని నమలడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జిరాఫీ ఇలా ఎముకలను నమలడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. జిరాఫీలు శాకాహారులే అయినప్పటికీ.. శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ మోతాదు తక్కువైనప్పుడు వాటిని పెంచుకోవడానికి ఇలా ఎముకలను నములుతుంటాయని చెప్పారు.
ఎముకల్లో ఉన్న ఫాస్పరస్ మొత్తాన్నీ పీల్చివేసిన తరువాత వాటిని పడేస్తాయని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని పేర్కొన్నారు. జిరాఫీలు ప్రపంచంలోనే ఎత్తైన శాకాహార జంతువులనే విషయం తెలిసిందే. వివిధ రకాల వృక్ష జాతులను అవి ఆహారంగా స్వీకరిస్తుంటాయి. ఈ ప్రక్రియను ఆస్టియోఫాగియా అని పిలుస్తారు. బాగా నమిలిన తరువాత అవి ఎముకలను మింగవు.
Giraffes are herbivores & use their long necks to reach the leaves & buds in the tree top. They have evolved that way.
— Susanta Nanda (@susantananda3) June 12, 2023
But sometimes chew & eat bones to get phosphorus. Nature is amazing. https://t.co/Llw6bHRj9I pic.twitter.com/VkICSn1lin
అందులోని పోషకాలను పొందిన తరువాత వాటిని పడేస్తాయి. తమ శరీరానికి అవసరమైన పోషకాలను పొందడానికి జిరాఫీలు తరచూ అడవి జంతువుల కళేబరాల నుంచి కొమ్ములు, ఎముకలు, ఏనుగు దంతాలను కూడా నములుతుంటాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్నొక అద్భుతంగా అభివర్ణిస్తోన్నారు నెటిజన్లు. ఇలాంటివెన్నో ప్రకృతిలో దాగి ఉన్నాయంటూ వ్యాఖ్యానిస్తోన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications