Viral Video: యాచకురాలు మృతి.. ఇంట్లో కరెన్సీ కట్టలు, నాణేల కుప్పలు!
Viral Video: ఈ రోజుల్లో ఎంతో మంది వృద్ధులు కుటుంబం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు.కానీ వారి నేపథ్యం ఏమిటి? వారు భిక్షాటన చేసి సంపాదించిన డబ్బుతో ఏమి చేస్తారు? రోజుకు ఎంత సంపాదిస్తారు? ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవు. అయితే కొందరు భిక్షగాళ్లు తమకు వచ్చిన డబ్బునంతా ఖర్చు చేస్తుండగా.. మరికొందరికి దానిని ఇంట్లో దాచుకునే అలవాటు ఉంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు కర్ణాటకలోని మాండ్యాలో వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లగా భిక్షాటన చేస్తున్ననూర్ అనే వృద్ధురాలు వయసు సంబంధిత వ్యాధితో ఆదివారం(ఆగస్టు 23) నాడు మృతి చెందారు. కానీ అంత్యక్రియల తర్వాత బంధువులు, స్థానికులు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఓ దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
భిక్షాటన చేసే వృద్ధురాలు మృతి.. ఇంట్లో లక్షల రూపాయలు!
జీవితమంతా భిక్షాటనతో గడిపిన నూర్ అనే వృద్ధురాలు ఆగస్టు 23న మృతి చెందింది. అయితే ఆమె అంత్యక్రియల అనంతరం ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. ఆమె భిక్షాటన చేస్తూ కూడబెట్టిన నాణేలు, నోట్ల కట్టలు కూడా దొరికాయి. వాటిని లెక్కించగా రూ. 8.50 లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటన మాండ్యా తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే మాండ్యా జిల్లాలోని గుతాలు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

మాండ్యా నగరంలోని గుతాలు ప్రాంతంలో నూర్ అనే వృద్ధురాలు నివసించేది. అయితే భిక్షాటన చేస్తూ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మరణించిన నూర్.. అందరికీ దూరంగా ఒంటరి జీవితం గడిపినట్లు తెలిసింది. ఆమె కుటుంబం ఆమెను పట్టించుకోకపోవడం వల్లే నూర్ భిక్షాటన చేయడం మొదలుపెట్టిందని సమాచారం. అదే కారణంతో ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధురాలు నిన్న వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మరణించింది.
బంధువులు, స్థానికులు మరణించిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి అనంతరం నూర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇంట్లో లక్షల రూపాయలు చూసి గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తనిఖీలో నాణేలు, నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. వాటిని లెక్కించగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.8.50 లక్షలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం స్థానికులు బేరసారాలు జరిపి ఆ డబ్బును బంధువులకు అప్పగించారు. ఆమె సోదరుల్లో ఒకరు రూ.6 లక్షలు తీసుకోగా.. మిగిలిన డబ్బును మసీదుకు విరాళంగా ఇచ్చారని తెలిసింది.
An elderly woman who lived by begging has reportedly left behind more than Rs.30 lakh in cash at her rented home in Mandya.
— Imran Khan (@KeypadGuerilla) August 24, 2026
Hoor Unnisa, who had been living alone since her sister’s death two years ago, died of age related illness.
Locals reportedly found 30+ sacks containing… pic.twitter.com/VuJQujJhVu














Click it and Unblock the Notifications