• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Virat Kohli: ఆ షాట్ ఒక మానవుడు కొట్టి ఉంటే ఔటయ్యేవాడు.. విరాట్ కోహ్లీ బౌండరీ దాటించి, సిక్స్‌గా మలిచాడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విరాట్ కోహ్లీ

ఇలా చేయగలిగేది అతడు మాత్రమే.

క్రికెట్ బిగ్గెస్ట్ స్టార్, అందులోనూ అతిపెద్ద వేదిక, తన కెరీర్‌లోని ప్రధానమైన దశలో ఇలాంటి ప్రదర్శన సరిగ్గా కుదిరింది. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, వాటన్నింటికీ హైలైట్ చేసేలా ఉంది ఈ ప్రదర్శన.

పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే క్రికెట్‌లో అలాంటి మ్యాచ్ మరొకటి ఉండదు. అయితే, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌(ఎంసీజీ)లో 90,293 మంది అభిమానుల ముందు జరిగిన అద్భుతమైన ఈ మ్యాచ్ ఇతర ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ల వంటిది కాదు. అసలు క్రీడా పోటీల్లోనే ఇలాంటి మ్యాచ్‌లు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అలాంటివి చాలా అరుదు.

ఈ క్రీడా లైట్ల వెలుతురులో క్రీడా విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు నాలుగు వికెట్ల తేడాతో అసాధ్యమైన విజయాన్ని సాధించాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానులు బ్లూ, గ్రీన్ టీషర్టులు ధరించి మైదానంలోకి వచ్చారు. చాలామంది తమ పిల్లలతో కూడా వచ్చారు. వారిలో కొందరు ఏడాదిలోపు శిశువులు ఉన్నారు. కొంతమంది తమ పిల్లల్ని భుజాలపై ఎక్కించుకుని వచ్చారు.

ఈ పిల్లల్లో చాలామందికి ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి మ్యాచ్‌లు అంటే ఏంటో తెలిసి ఉండదు. కానీ త్వరలోనే వాళ్లు తెలుసుకుంటారు.

భారత జట్టు గెలిచిన తర్వాత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి

ఈ మ్యాచ్‌ టికెట్లు ఐదు నిమిషాల్లోనే అయిపోయాయి. అలా టికెట్ దక్కించుకుని అదృష్టవశాత్తూ మైదానంలోకి వచ్చిన వాళ్లు జాతీయ గీతాలను ఆలపిస్తున్నప్పుడు ఇక్కడి వాతావరణం ఎలా ఉందంటే.. ఒళ్లు పులకించిపోయింది. ఈ అనుభవానికి ముగ్ధుడైపోయిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కళ్ల నుంచి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. 421 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవజ్ఞుడైన వ్యక్తి పరిస్థితి అది.

మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ప్రతి బంతికీ అభిమానుల స్వర విన్యాసాలు రెట్టింపు అయ్యాయి.. అది మొదటి బంతి నుంచే ప్రారంభమైంది. తర్వాత బంతికి వికెట్ తీసినా, సిక్స్ కొట్టినా.. అసలు ఆడకుండా వదిలేసినా కూడా హోరు మాత్రం ఆగలేదు.

145 ఏళ్ల కిందట ఈ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘకాలంలో ఈ మైదానం ఎన్నో మ్యాచ్‌లను చూసింది. కానీ, ఇలాంటి మ్యాచ్ మాత్రం చూడలేదు.

ఈ మైదానానికి వెలుపల చాలామందికి చాలా సమస్యలు ఉండి ఉండొచ్చు. ఈ రెండు దేశాల మధ్య కూడా గత వారం రోజులుగా చాలా మాటల యుద్ధం జరిగింది. దీనిని మర్చిపోకూడదు. కానీ, ఈ మైదానంలో మాత్రం ఊహించని భావోద్వేగాలు అందరినీ ఉద్వేగానికి గురిచేశాయి.

అయితే, మైదానం లోపల అందరినీ ఆకర్షించడమే కాకుండా.. ఆ ఆకర్షణను కూడా వేటాడి, దాచుకుని, దాని వెలుగులో స్నానం చేసే విరాట్ కోహ్లీ మాత్రం మ్యాచ్ ముగిసే వరకూ తన భావోద్వేగాలను చాలా బాగా సంభాళించుకున్నాడు.

భారత జట్టుకు శుభారంభం లభించింది. 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. పాకిస్తాన్ కెప్టెన్, ఆ జట్టుకు విజయాలు సాధించిపెట్టే బాబర్ ఆజమ్‌ను తన తొలి బంతితోనే ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ చేశాడు.

దీని ఫలితం.. చెవులు చిల్లులు పడేంత స్థాయిలో స్టాండ్స్‌లోని అభిమానులు హోరెత్తించారు. అయితే, అసలైన అరుపులు ఇంకా మొదలు కాలేదనే చెప్పాలి.

గాలి మళ్లింది. ఇప్పుడు పచ్చ జెండాలు గర్వంగా గాల్లో ఎగురుతున్నాయి. భారత జట్టులోని టైటాన్స్ లాంటి బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. కోహ్లీ ఒక్కడే నిలబడ్డాడు.

విరాట్ కోహ్లీ 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు

ఫ్లడ్‌లైట్ల వెలుగు కింద విరాట్ కోహ్లీ పోరాట యోధుడిలా కనిపించాడు. వికెట్ల మధ్య 33 ఏళ్ల విరాట్ ఎలక్ట్రిక్ వేగంతో పరిగెత్తడాన్ని చూసి రాజకీయ నాయకులు అతడిని నేషనల్ పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ చేసినా తప్పులేదు అనిపించింది.

నిజానికి విరాట్ నెమ్మదిగా ప్రారంభించాడు. మొదటి 20 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, అప్పుడే అతడు మ్యాచ్ భారాన్ని తన భుజాలపైకి ఎత్తుకున్నాడు.

గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. గత సెప్టెంబర్‌కు ముందు మూడేళ్ల పాటు కోహ్లీ సెంచరీ చేయలేదు. అసలు టీ20ల్లో టీమిండియాలో కోహ్లీకి స్థానం ఇవ్వకూడదని, ఆ స్థానాన్ని పొందే అర్హత అతడికి లేదని కొందరు అన్నారు.

టీ20 క్రికెట్‌లో పద్ధతులు మారిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో అటాకింగ్‌గా ఆడటమే పద్ధతిగా మారింది. అప్పుడే సాధించాల్సిన పరుగులు మన చేయి దాటిపోకుండా ఉంటాయి. కానీ, కోహ్లీ చేధనల్లో ఆరితేరిన మాస్టర్.

అతడు ప్రతిసారీ తనదైన పద్ధతిలోనే చేసుకుంటూ వెళ్తాడు. పరుగులు సాధించుకుంటూ వెళ్లడం, పరిస్థితులు అనుకూలించినప్పుడు దాడి చేయడం.

ఆట ఊపందుకుంది. ఎప్పుడెప్పుడు టీమిండియా చేతుల్లోంచి ఆట చేజారుతోందో, అప్పుడు తిరిగి పట్టు సాధించేందుకు కోహ్లీ చేయాల్సిందంతా చేశాడు.

90 వేల మంది అభిమానులను కళ్లప్పగించి చూస్తుంటే.. 'నేనున్నా. ఓడిపోనివ్వను' అన్న భరోసా ఇచ్చాడు.

బ్యాట్‌తో బంతిని అలా కొడుతుంటే.. ఆ బ్యాట్ కోహ్లీ చేతికి కొనసాగింపా? అనిపించింది. అంత పొందికగా బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి.

అయితే, పరిస్థితులు విషమంగా మారిపోయినప్పుడు కోహ్లీ తనలోని ఉత్తమ ఆటతీరును ప్రదర్శించాడు.

ఎనిమిది బంతులకు 28 పరుగులు చేస్తేనే భారత్ విజయం సాధిస్తుంది.

అప్పుడు కుడిచేతి వాటం బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ హరీస్ రవూఫ్ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌పై డ్రైవ్ చేస్తూ బౌలర్ తలమీదుగా బౌండరీ లైన్ దాటించాడు. ఇదే షాట్ మనుషులు కొట్టి ఉంటే.. అది కచ్చితంగా వాళ్లు ఔటై, అవమానభారంతో కుప్పకూలిపోయేలా చేసేది. కానీ, ఈ షాట్ కొట్టింది విరాట్ కోహ్లీ.

ఈ షాట్ ఫలితంగా మొదలైన హోరు బహుశా బెంగళూరులో ఉన్నవాళ్లకు కూడా వినిపించి ఉంటుంది.

ఆట ముగిసేలోపు మరో రెండుసార్లు విరాట్ కోహ్లీ బంతిని బౌండరీ దాటించాడు. కోహ్లీ శక్తి అంతకంతకూ పెరుగుతుంటే పాకిస్తాన్ వాడిపోయింది.

ఆట ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ భావోద్వేగాన్ని దాచిపెట్టుకోవడానికి కష్టపడ్డాడో.. అదే భావోద్వేగాన్ని కోహ్లీ బహిర్గతం చేశాడు.. మ్యాచ్ గెలిచిన వెంటనే అతడు గ్రౌండ్‌పై కూలబడి తన పిడికిలితో గుద్దుతూ కనిపించాడు.

''హ్యాట్సాఫ్ టు విరాట్. భారతదేశం కోసం అతను ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది'' అని రోహిత్ శర్మ చెప్పాడు.

''మేం ఉన్న పరిస్థితిని బట్టి, చివరికి విజయం సాధించడాన్ని బట్టి ఇది భారతదేశం గొప్ప ప్రదర్శనల్లో ఒకటి''.

2016 టీ20 ప్రపంచకప్‌లో మొహాలీలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఈ ప్రదర్శన ముందు అది కూడా తగ్గిపోతుందని, ఇదే తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని విరాట్ స్వయంగా అంగీకరించాడు.

అప్పుడు విరాట్ 51 బంతుల్లో 82 పరుగులు చేయగా, ఈరోజు 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. రెండు సార్లూ నాటౌట్‌గా నిలిచాడు.

''మాటల్లేవ్. ఎలా జరిగిందో తెలియట్లేదు. నేను నమ్మకాన్ని వదులుకోలేదు. చివరివరకూ ఆడాలనుకున్నా. నిజంగా నాకు మాటలు దొరకట్లేదు'' అని కోహ్లీ అన్నాడు.

''ఇది అసాధ్యం అనిపించింది''.

కోహ్లీ లాంటి సూపర్‌స్టార్లకు అసాధ్యం అనేది ఏదీ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Virat Kohli: If a human had hit that shot, he would have been out.. Virat Kohli crossed the boundary and hit it for a six.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X