భయపడ్డారు, అందుకే అలా...: ఆర్కే నగర్ పోటీపై హీరో విశాల్
Recommended Video

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని చాలా మంది కోరుకున్నారని హీరో విశాల్ అన్నారు. అలా కోరుకున్నవారిలో సినిమా వాళ్లు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
తాను మళ్లీ పోటి చేయాలా, వద్దా అనే విషయంపై ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి జనవరిలో మలేసియాలో జరిగే స్టార్ నైట్ మీదనే తన దృష్టి అంతా ఉందని చెప్పారు.

సొంత బ్యానర్‌పై సినిమా
తన సొంత బ్యానర్‌పై మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఇరుుబుతిరై సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన సమంత నటిస్తోంది. యాక్షన్‌కింగ్ అర్జున్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం జనవరిలో విడుదల కాబోతోంది. ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ను బుధవారం రాత్రి చెన్నైలో విడుదల చేశారు.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో...
సైబర్ టెర్రరిజం నేపథ్యంతో ఇరుంబుతిరై సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి విశాల్ మాట్లాడారు.ఈ సినిమా ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండిందని, కానీ, నిర్మాతల సంఘం ఎన్నికల కారణంగా ఆలస్యమైందని అన్నారు. ఆర్‌కే నగర్‌లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఈ సినిమా జనవరిలో కూడా విడుదల కాదేమోనని భయపడ్డారని ఆన్నారు.

అందులో మిత్రన్ కూడా ఉన్నారు..
ఆర్‌కే నగర్‌లో పోటీ చేయకూడదని కోరుకున్న వారిలో దర్శకుడు మిత్రన్ కూడా ఉన్నారు. సినిమా ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే మిత్రన్ అలా కోరుకున్నారని ఆయన అన్నారు. ఆయన ప్రార్థనలు ఫలించే తాను పోటీ చేయలేకపోయానేమోనని విశాల్ నవ్వుతూ అన్నారు.

అలా అనిపించిందని...
ఇరుంబుతిరైలో కథ, సన్నివేశాలు యదార్థంగా ఉంటాయని, ఈ సినిమాలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని సమంత అన్నారు. తాను విజయ్, సూర్య వంటి అగ్రహీరోలతో నటించేటప్పుడు వారికి గౌరవమిచ్చి నటించాల్సి ఉండేదని, అయితే ఈ సినిమాలో విశాల్‌తో తన సమ వయస్కుడితో నటిస్తున్నట్లు అనిపించిందని హీరోయిన్ సమంత అన్నారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications