శశికళ కు జైల్లో వీవీఐపీ సేవలు, రూ. 2 కోట్లు లంచం, మాజీ డీజీపీ మీద ఎఫ్ఐఆర్, బలి!
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ కు వీవీఐపీ సేవలు చేశారని, ప్రత్యేక గదులు కేటాయించారని వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ డీజీపీ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. డీఐజీ రూపా చేసిన ఆరోపణలు నిజమే అని వెలుగు చూడటంతో మాజీ డీజీపీ మెడకు ఉచ్చు బిగుసుకుంది.

డీఐజీ రూపా ఆరోపణలు
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు రాచమర్యాదలు చేస్తున్నారని, ప్రత్యేక గదులు కేటాయించారని, ఆమెకు సేవలు చెయ్యడానికి పని మనిషి ఉన్నారని, అందు కోసం రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని గత ఏడాది డీఐజీ రూపా ఆరోపించిన విషయం తెలిసిందే.
Recommended Video


రూపా మీద డీజీపీ ఫైర్
గత ఏడాది జైళ్ల శాఖ డీఐజీగా పని చేస్తున్న రూపా ఆకస్మికంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు పరిశీలించడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. తన అనుమతి లేకుండా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఎందుకు వెళ్లావు, ఎలా పరిశీలిస్తావు అంటూ డీఐజీ రూపా మీద అప్పటి జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్ మండిపడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

డీఐజీ రూపా డిమాండ్
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని అక్రమాలపై విచారణ జరిపించాలని, శశికళ దగ్గర ఎవరు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారు అని ఆరా తియ్యాలని గత ఏడాది డీఐజీ రూపా అప్పటి జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్, కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డీఐజీ రూపా బహిరంగంగా డిమాండ్ చేశారు.

సీఎం సిద్దూ సీరియస్
శశికళకు వీవీఐపీ సేవలు అందిస్తున్న విషయంలో డీజీపీ సత్యరాయణ రావ్, డీఐజీ రూపా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇద్దరూ మీడియా ముందు రచ్చకెక్కడంతో సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం రూపా, సత్యనారాయణ రావ్ లను జైళ్ల శాఖ నుంచి బదిలి చేశారు.

చిన్నమ్మకు సేవలు
డీఐజీ రూపా ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ జరిపిన వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటి ఇటీవల కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

రంగంలోకి ఏసీబీ !
వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ అధికారులు నివేదిక క్షుణ్ణంగా పరిశీంచారు. గత ఏడాది చివరిలో డీఐజీ రూపా ఇచ్చిన నివేదికను పరిశీలించారు.

శశికళ దెబ్బకు మాజీ డీజీపీ బలి !
సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు కర్ణాటక మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. జైల్లో ఉన్న శశికళకు వీవీఐపీ సేవలు చేసినందుకు ఇప్పుడు మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ బలి అయ్యారు. ఇక ముందు ఎంత మంది అధికారులు బలి అవుతారో వేచి చూడాలి.

డీఐజీ రూపా క్లారిటీ
మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ మీద ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వెలుగు చూడటంతో డీఐజీ రూపా సోషల్ మీడియలో స్పంధించారు. ఆరోజు తాను ఎంతో ఆవేదనతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను. ఇప్పుడు అది నిజం అని వెలుగు చూసింది. శశికళకు వీవీఐపీ సేవలు చేసిన ఆరోపణల విషయంలో ముగింపు సంచలనంగా ఉంటుందని అనుకుంటున్నానని డీఐజీ రూపా ట్వీట్ చేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications