చిన్నమ్మ శశికళ నటరాజన్ వదిన మృతి, పెరోల్ ఇవ్వాలని సుప్రీం కోర్టులో అర్జీ!

చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ సోదరుడు సుందరవదనం సతీమణి సంతానలక్ష్మి మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతానలక్ష్మి గురువారం మద్యాహ్నం మరణించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతానలక్ష్మికి ఒక్క సారిగా గుండెపోటు రావడంతో మరణించారని వైద్యులు చెప్పారని శశికళ కుటుంబ సభ్యులు తెలిపారు. శశికళ సొంత సోదరుడు అయిన సందరవదనం భార్య సతీమణి టీటీవీ దినకరన్ కు స్వయానా మేనత్త.

VK Sasikala sister in law Santhnalakshmi passes away

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ తన వదిన అంత్యక్రియల్లో హాజరుకావడానికి పెరోల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం శశికళ నటరాజన్ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పెరోల్ కోసం పిటిషన్ దాఖలు చెయ్యడానకి ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళ తప్పకుండా సంతానలక్ష్మి అంత్యక్రియలకు హాజరౌతారని చిన్నమ్మ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+