పంజాబ్ లోకి యూపీ, బీహార్ భయ్యాలు-చన్నీ కామెంట్స్-ప్రియాంక ఎవరన్న కేజ్రీవాల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ను నిలువరించేందుకు ఆప్ తో పాటు బీజేపీ, అమరీందర్ సింగ్ తో పాటు ప్రత్యర్ధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో వారికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ సీఎం చరణ్ జీత్ చన్నీ కూడా మాటలకు పనిచెప్పారు.
యూపీ-బీహార్ భయ్యాలు పంజాబ్ లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలంటూ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ఇవాళ ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ఆయన పక్కనే ఉన్నారు. అయితే బీజేపీని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో చన్నీ వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆప్ ఘాటుగా స్పందిస్తున్నాయి.

యూపీ, బీహార్ రాష్ట్రాల ప్రజలను ముఖ్యమంత్రి చన్నీ అవమానించారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడుతున్న యూపీ ప్రజలను ప్రియాంక గాంధీ అవమానించారని బీజేపీ పేర్కొంది. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరుగుతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా చన్నీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. "ఇది చాలా సిగ్గుచేటు. ఏదైనా వ్యక్తి లేదా ఏదైనా నిర్దిష్ట సమాజాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రియాంక గాంధీ కూడా యుపికి చెందినవారు, కాబట్టి ఆమె కూడా భయ్యానా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications