ట్విట్టర్ డౌన్: వాన్నక్రై ఎటాక్ జరిగిందా?, యూజర్స్ ఆందోళన

ట్విట్టర్ లోకి లాగిన్ అయిన 15-20నిమిషాల వరకు సర్వర్ డౌన్ లోనే ఉందని, కొంతమంది యూజర్స్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై వాన్నక్రై సైబర్ దాడి జరిగిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ట్విట్టర్ మొరాయించడంతో చాలామంది యూజర్స్ కు ఇదే అనుమానం కలిగింది. ఉదయం 10.30గం. సమయంలో ట్విట్టర్ లో ట్వీట్స్ చేసేటప్పుడు ఇంటర్నల్ ఎర్రర్, ఇతరత్రా మేసేజ్ లు కనిపించాయని యూజర్స్ చెబుతున్నారు.

ట్విట్టర్ లోకి లాగిన్ అయిన 15-20నిమిషాల వరకు సర్వర్ డౌన్ లోనే ఉందని, కొంతమంది యూజర్స్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ట్వీటింగ్, రీట్వీటింగ్ వంటి వాటిల్లో సమస్యలు వచ్చాయని వారు చెబుతున్నారు. గత 20నిమిషాల వ్యవధిలో అసలు ఒక్క ట్వీట్ చేయడానికి కూడా వీలుపడలేదని ఓ ట్విట్టర్ ఖాతాదారుడు పేర్కొన్నాడు.

25నిమిషాల వరకు ట్విట్టర్ డౌన్ అయిందని మరో నెటిజెన్ ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్ కు వచ్చిన ఈ సమస్యలన్ని వాన్నక్రై ఎఫక్టేనా? అన్న అనుమానం మొదలైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్విట్టర్ మొరాయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+