Viral Video: వావ్, తిమింగళానికి మత్స్యకారుల సాయం, వలలో చిక్కుకుంటే
కొందరు సముద్రంలో షిప్పింగ్ చేస్తారు. మరికొందరు చేపలు పడుతుంటారు. అలా వారికి సరదా.. అయితే సముద్రంలో ఓ వలకు తిమింగళం చిక్కింది. దీంతో ఎవరూ చూసినా భయపడతారు. కానీ ఓ మత్స్యకారుడు మెల్లిగా ఆ వలను కట్ చేశాడు. దీంతో ఆ తిమింగళం అప్పటివరకు ఊపిరి సలపట్టుగా ఉండి.. తర్వాత ఎగురుకుంటూ వెళ్లింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియో చూడండి.

చిక్కిన తిమింగళం
వలకు తిమింగళం చిక్కింది. అలా అదీ కష్టపడుతూ వస్తోంది. ఓ మత్య్సకారుడి బోట్ వద్దకు వచ్చింది. దానిని చూసి.. అతనికి జాలేసింది. వీడియోను కొందరు ఇవాళ యూట్యూబ్‌లో షేర్ చేశారు. దానికి క్యాప్షన్ 'ఏ వేల్ అప్రొచె్స్ ద ఫిషర్ మెన్ షిప్.. అని రాశారు. బోటు వద్ద నలుగురు మత్య్సకారుల వరకు ఉన్నారు. అదీ వారి వద్దకు సాయం చేయాలని వచ్చింది.

ముందుకువచ్చిన ఇద్దరు
అందులో ఇద్దరు మత్య్సకారులు దానికి సాయం చేశారు. ఒకరు వలను లాగగా.. మరొకరు దగ్గరికి వెళ్లి కోశారు. దీంతో దానికి వెళ్లడానికి వీలయ్యింది. వెంటనే స్విమ్ చేసింది. కోసే సమయంలో మత్య్సకారుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అదీ కూడా తనను ఏమైనా చేస్తారని అనుకుందే ఏమో.. వెంటనే స్విమ్ చేసింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

62 వేల సార్లు
ఇప్పటికే వీడియోను 62 వేల సార్లు చూశారు. వేలాది మంది లైక్ చేశారు. తిమింగళానికి కూడా సాయం చేసిన వారిని అభినందిస్తున్నారు. జనం ఎప్పుడూ సాయం చేస్తారు. అని ఒకరు రాశారు. ఆ రోప్ చిక్కుకొని మిగతా జీవులు కూడా ఇబ్బంది పడేవి.. చనిపోయేవి అని అభిప్రాయపడ్డారు. మత్స్యకారులు చేసిన సాయం గొప్పదని మరొకరు రాశారు. అవును నిజమే.. ఈ రోజుల్లో సాటి మనిషికి సాయం చేయడానికి ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇక తిమింగళానికి సాయం చేసి శభాష్ అనిపించుకున్నారు.












Click it and Unblock the Notifications