Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నైజీరియన్ యువతి రచ్చ: ముసుగేసి పట్టారు(వీడియో)

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ నైజీరియన్ యువతి రచ్చ రచ్చ చేసింది. ముందుగా ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన ఆ యువతి.. అక్కడి సామాన్లను నేలకేసి కొట్టింది. అంతేగాక, అడ్డం వచ్చిన వారిపై దాడికి యత్నించింది.

పలువురిపై చేయి కూడా చేసుకుంది. సమాచారం అందుకుని అక్కడి చేరుకున్న పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. పోలీసులపైకీ దూసుకెళ్లింది ఆ నైజీరియన్ యువతి. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు పోలీసులు. మహిళా కానిస్టేబుళ్లు కూడా ఆమెను కట్టడి చేసేందుకు విఫలయత్నం చేశారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి ఓ బట్టతో ముసుగేసి ఆమెను బంధించాడు. వెంటనే చేరుకన్న పోలీసులు.. ఆమె చేతులను కట్టేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, సదరు యువతి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+