అద్భుతం: గోమూత్రంతో కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చట..!

చాలామంది ఎలాంటి ఆధారాలు లేకుండానే పలు సంచలన విషయాలను చెబుతుంటారు. కొన్ని వినటానికి బాగానే ఉన్నా... అది నిజంగా సాధ్యమేనా అనే అనుమానం రాక మానదు. ఉదాహరణకు మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్ ఉండేదని ఓ రాజకీయనాయకుడు సెలవిచ్చారు. అయితే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ... గోపంచకంతో కేన్సర్‌ను అంతం చేయొచ్చని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు గుజరాత్ విశ్వవిద్యాలయంకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు. ఏంటి నమ్మలేకున్నారా... వారు ప్రయోగాలు చేసి మరీ ఈ నిజాన్ని నిరూపించారు.

జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన బయోటెక్నాలజీ సైంటిస్టులు గోవు మూత్రంతో కేన్సర్‌కు చరమగీతం పాడారు. ఆ ప్రయోగం విజయవంతమైంది. అంతేకాదు గోపంచకం చాలా కేన్సర్లకు విరుగుడు అని వారు తేల్చి చెప్పారు. ఉదాహరణకు ఈ గోమూత్రంతో నోరు, గర్భాశయ,ఊపిరితిత్తులు, చర్మం ఇంకా రొమ్ము క్యాన్సర్‌లాంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చని వివరించారు. ఈ తరహా ప్రయోగం చాలా కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. ముందుగా కేన్సర్ ఉన్న కణాలను ఓ బాటిల్‌లో ఉంచినట్లు చెప్పారు. అయితే ఈ కణాలను చంపేందుకు ఒక్క రోజుకు ఎంతమోతాదులో గోమూత్రం అవసరం అవుతుందో ముందుగానే లెక్కగట్టినట్లు భట్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు.

Watch out: Put Check to Cancer With Cow urine,says scientists

ఆ తర్వాత ఈ ప్రయోగం ఎలకపై నిర్వహించినట్లు భట్ చెప్పారు. ఇది విజయవంతమైతే వివిధ రకాల క్యాన్సర్లను నయం చేసేందుకు గోమూత్రంతో మాత్రలు లేదా ట్యాబ్లెట్లను తయారు చేస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా కేన్సర్‌ను జయించేందుకు చాలామంది కీమోథెరపీని ఆశ్రయిస్తారు. అయితే ఇక్కడ ఒక నష్టం కూడా జరుగుతుందని గ్రహించాలి. కీమోథెరపీతో ఆరోగ్యకరంగా ఉన్న కణాలు కూడా దెబ్బతింటాయని అయితే గోపంచకం మాత్రం ఇన్ఫెక్షన్‌కు గురైన కణాలను మాత్రమే చంపేస్తుందని వివరించారు.

శాస్త్రవేత్తలు మాత్రం గోమూత్రంతో కేన్సర్‌ను జయించడం సాధ్యమే అని చెబుతున్నప్పటికీ... అంత పెద్ద మహమ్మారిని ఒక్క గోపంచకంతో జయించవచ్చా? అని అనుమానం వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+