BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ పార్టీలు సరికొత్త అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. అయితే, ఈసారి బెంగాలీల మనసు గెలుచుకోవడానికి రాజకీయ నాయకులు 'ఆహారపు అలవాట్ల'ను యుద్ధ ప్రాతిపదికన వాడుకుంటున్నారు. బెంగాల్ సంస్కృతిలో ప్రాణప్రదమైన 'చేపల' చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ సాగుతోంది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రచారంలో బీజేపీపై ఒక వినూత్నమైన దాడిని ప్రారంభించారు. "ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు బెంగాల్ సంస్కృతి, రుచులు తెలియవు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపలు, మాంసం, గుడ్లు తినడంపై ఆంక్షలు విధిస్తారు" అని ఆమె పదే పదే హెచ్చరిస్తున్నారు. పురూలియా సభలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసాహారంపై ఆంక్షలు ఉన్నాయని, బెంగాల్‌లోనూ అదే పరిస్థితి వస్తుందని ఆమె ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం బీహార్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతున్నారు.

West Bengal Assembly Elections 2026 Mamata s Fish Politics vs BJP s Counter-Campaign with Fish in Hand Meat Ban Row

చేపలు పట్టుకుని బీజేపీ ప్రచారం!

మమతా బెనర్జీ చేస్తున్న 'చేపల రాజకీయం' బీజేపీని ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడేసింది. బెంగాలీలకు చేపలంటే ఉన్న మమకారం దృష్ట్యా, ఈ ఆరోపణలు ఓట్లపై ప్రభావం చూపుతాయని భావించిన కాషాయ దళం వెంటనే అప్రమత్తమైంది. తాము ఆహారపు అలవాట్లకు వ్యతిరేకం కాదని నిరూపించుకోవడానికి బీజేపీ నేతలు వినూత్నంగా స్పందిస్తున్నారు. బిధాన్‌నగర్ బీజేపీ అభ్యర్థి శరద్వాత్ ముఖర్జీ ఏకంగా ఒక పెద్ద చేపను చేత్తో పట్టుకుని వీధుల్లో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాము కూడా చేపలు, మాంసం తింటామని, అధికారంలోకి వస్తే ఎటువంటి ఆంక్షలు ఉండవని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

శాంపిల్ చూపించిన నేతలు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు షామిక్ భట్టాచార్య సైతం దీదీ ఆరోపణలను కొట్టిపారేశారు. బెంగాలీల ఆహారపు అలవాట్లను మార్చే ఉద్దేశం తమ పార్టీకి లేదని, శాకాహారాన్ని బలవంతంగా రుద్దబోమని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే మమతా బెనర్జీ లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో 'ఫిష్ పాలిటిక్స్' (Fish Politics) పేరుతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆహార పదార్థం ఎన్నికల ప్రధాన అజెండాగా మారడం విశేషం. మరి ఈ 'చేపల రాజకీయం' ఎవరికి కలిసి వస్తుంది? బెంగాలీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అన్నది ఫలితాలు తేల్చనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+