ప్రభుత్వాన్ని రద్దు చేయండీ... ఉప ఎన్నికలకు మేము కూడ రెఢీ...యడ్యూరప్ప
కర్ణాటక రాజకీయలు కీలక మలుపు తిరుగుతున్నాయి. జూన్ 10లోపు ప్రభుత్వం పడిపోతుందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర్రంలోదుమారాన్ని రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ కూటమీ సైతం బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఒక వేళ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మొత్తం ప్రభుత్వాన్నే రద్దు చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే ఈ వార్తలపై బీజేపీ నేత యడ్యూరప్ప స్పందించారు. ఉప
ఎన్నికలను ఎదుర్కోనేందుకు తాము కూడ సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

ఒకవేళ ప్రభుత్వం కర్ణాటకలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏన్నికలకు వెళ్లాలని చూస్తే బీజేపీ దాన్ని స్వాగతిస్తుందని బీజేపీ రాష్ట్ర్ర కర్ణాటక రాష్ట్ర్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించాడు.తాజాగా పార్లమెంట్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలను దక్కించుకోవడంతో కాంగ్రెస్ , జేడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని
కూలగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బతీసేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.
దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇక బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జూన్ 10లోపు ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత బీజేపీ పావులు కదిపేందుకు సిద్దంగా ఉందని కాంగ్రేస్ పార్టీ నేతలే విమర్శలకు దిగుతున్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తెరలేసింది












Click it and Unblock the Notifications