సీఎంగా శశికళను ఎన్నుకోవడంపై బీజేపీ అనుమానాలు
అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అనుమానాలు వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళ నటరాజన్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అనుమానాలు వ్యక్తం చేశారు. శశికళ ఎన్నిక విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
అన్ని అంశాలను ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు పరిశీలిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలన్నది తమ అభిమతం కాదని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా విషయంలో, ఆయన తిరుగుబాటు చేయడంలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications