Severe Rainfall Alert:ఏపీతోపాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తుఫాన్ వచ్చే ముందు తీర ప్రాంతంలో అలజడి నెలకొంటుంది. అల్పపీడనం, వాయుగుండానికి తోడు తుఫానుల వల్ల దక్షిణ భారతం వణికిపోతుంది. పంట కోత సమయంలో అన్నదాతల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడపకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ తెలియజేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. పుదుచ్చేరి, కరైకల్‌లో ఈ నెలలో భారీ వర్షాలు పడతాయని తెలియజేసింది. గత 24 గంటల్లో పుదుచ్చేరిలో 11.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు నిండిపోయాయి. మరికొన్ని రోజులు వర్షం ఇలాగే కొనసాగనుందని అంచనా వేసింది.

Weather News: heavy rainfall activity in southern Indian states

తమిళనాడులో కూడా వర్ష ప్రభావం ఉండనుంది. సోమవారం వర్షం కురిసిందని.. అదీ మంగళవారం కూడా కొనసాగుతుందని తెలిపింది. నేటి నుంచి వర్షం మరింత పెరుగుతుందని పేర్కొంది. అలాగే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని వివరించింది. కన్యాకుమారి, తిరునెల్వెలి, తూతుకుడి, రామనాథపురంలో కూడా వర్ష ప్రభావం ఉండనుంది. చెన్నై తీర ప్రాంతంలో కూడా వర్ష ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

ఇటె గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇటు గత 15 రోజులుగా తమిళనాడు నగరం భారీవర్షాలతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు. ఈ సమయంలో మరోసారి వానగండం పొంచి ఉండటంతో తమిళనాడు వాసులు టెన్షన్ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+