West Bengal AI Surveys: బెంగాల్ వాళ్లదే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..!

పశ్చిమబెంగాల్లో (West Bengal) ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ఏఢాది కాలంగా అక్కడ ఎన్నికల కమిషన్ కూ, అధికార తృణమూల్ కాంగ్రెస్ కూ మధ్య జరుగుతున్న పోరు, అలాగే కేంద్రానికీ, మమతా బెనర్జీకి జరుగుతున్న పోరు, ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన మమత.. ఈసారి ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ.. ఇలా ఎన్నో విషయాలు ఈసారి ఎన్నికలపై ఆసక్తిని పెంచేశాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఏం జరగబోతోందో ఏఐ ప్లాట్ ఫామ్స్ (AI Models) చెప్పేశాయి.

West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?

పశ్చిమబెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో దాదాపు కోటి మంది ఓటు హక్కు కోల్పోయిన తర్వాత అక్కడ ఎన్నికలపై కేంద్రం, ఈసీ ప్రభావం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో మమత ఈసారి గెలుస్తారా లేక కేంద్రం, ఈసీ అండదండలు ఉన్నవారు గెలుస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐ ప్లాట్ ఫామ్స్ మాత్రం 294 సీట్లున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తేల్చాయి.

West Bengal 2026 AI Models Predict TMC Narrow Win Over BJP Surge
Tamil Nadu AI Survey: తమిళనాడులో క్లీన్ స్వీప్ ? విజేతను తేల్చేసిన ఏఐ..!
Tamil Nadu AI Survey: తమిళనాడులో క్లీన్ స్వీప్ ? విజేతను తేల్చేసిన ఏఐ..!

ఇందులో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజేతగా నిలవబోతోందని పలు ఏఐ ప్లాట్ ఫామ్స్ అంచనా వేస్తున్నాయి. వీటిలో గ్రోక్ టీఎంకీకి 155-175 సీట్లు, బీజేపీకి 105-125 సీట్లు ఇచ్చింది. అలాగే గూగుల్ జెమినీ టీఎంకీకి 145-155 సీట్లు, బీజేపీకి 135-145 సీట్లు ఇచ్చింది. పర్ ప్లెక్సిటీ ఏఐ టీఎంసీకి 165-175 సీట్లు, బీజేపీకి 110-118 సీట్లు ఇచ్చింది. రెడ్డిట్ ఏఐ కూడా టీఎంసీకి 175-195 సీట్లు ఇవ్వగా, బీజేపీకి 90-110 సీట్లు ఇచ్చింది. పాలిమార్కెట్ అంచనాల్లోనూ టీఎంసీకి 50.65 శాతం ఓట్లు రాబోతున్నాయని, బీజేపీకి 48.70 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. దీన్ని బట్టి టీఎంసీ మరోసారి కచ్చితంగా గెలుస్తుందని ఏఐ ప్లాట్ ఫామ్స్ ఏకగ్రీవంగా తేల్చేసినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+