వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘బంగ్లా’గా పశ్చిమ బెంగాల్: అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవ ఆమోదం, కారణమిదే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును 'బంగ్లా'గా మారుస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే కొత్త పేరు అమల్లోకి రానుంది.

పశ్చిమబెంగాల్ పేరును ఇంగ్లీష్‌లో 'బెంగాల్'గా, బెంగాలీలో 'బంగ్లా'గానూ మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తొలుత కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

West Bengal Assembly passes resolution to change states name to Bangla

అనంతరం మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌లోనూ 'బంగ్లా'గా మార్పు చేస్తూ మరో ప్రతిపాదన పంపినట్లు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు.

పశ్చిమ బెంగాల్ పేరు ఇంగ్లీష్‌లో 'డబ్ల్యూ'తో (వెస్ట్ బెంగాల్) మొదలవుతుండడంతో... ఎప్పుడైనా అఖిల రాష్ట్రాల సమావేశం జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల కంటే ఆ రాష్ట్రం పేరు చిట్టచివరన వస్తోంది. అక్షర క్రమంలో రాష్ట్రాల జాబితా తయారు చేసేటప్పుడు అన్నిటి కంటే చివరన ఉండాల్సిరావడంతో పేరు మార్చాలని పశ్చిమబెంగాల్ పట్టుదలతో ఉంది.

English summary
The West Bengal Assembly on Thursday passed the bill to change the state's name from West Bengal to 'Bangla'. The resolution would now be sent to the Home Ministry for approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X