నీ పని చూసుకో, తరువాత తిరుగు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ కు మమతా బెనర్జీ వార్నింగ్ !
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరికలు చేశారు. మొదట నీ రాష్ట్రాన్ని ఉద్దరించుకుని తరువాత ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని మమతా బెనర్జీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని హత్యలు జరిగాయో దేశ ప్రజలకు తెలుసని మమతా బెనర్జీ ఆరోపించారు.
ఆదివారం పశ్చిమ బెంగాల్ లోని దినజ్ పూర్ జిల్లాలోని బలార్ ఘాట్ లో నిర్వహించిన గణతంత్ర బచావో కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యంత్రి యోగీ ఆధిత్యనాథ్ హాజరు కావలసి ఉంది. అయితే యోగీ ఆధిత్యనాథ్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి మమతా బెనర్జీ అనుమతి ఇవ్వలేదు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంతో యోగీ ఆధిత్యనాథ్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ విషయంలో మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి తాము ఎందుకు అనుమతి ఇవ్వాలి అని అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఎంత మంది ప్రజలు హత్యకు గురైనారు, పోలీసులు హత్యకు గురైనారు, ప్రజలను రాళ్లతో కొట్టి హత్య చేశారు అని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ను ఉద్దరించలేని అక్కడి సీఎం యోగీ ఆధిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ కు వచ్చి ఏమి ఉద్దరిస్తారు అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే యోగీ ఆధిత్యనాథ్ విజయం సాధించలేరని మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ను ఉద్దరించుకున్న తరువాత యోగీ ఆధిత్యనాథ్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించాలని మమతా బెనర్జీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లో గెలువలేనని తెలుసుకున్న సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో సంచరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!