బెంగాల్ శకటం తిరస్కరణ.. ప్రధాని మోదీకి దీదీ ఘాటుగా లేఖ
కేంద్రప్రభుత్వ తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సారి నిప్పులు చెరిగారు. గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో బెంగాల్ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబాష్ చంద్రబోస్ 125 జయంతిని పురస్కరించుకోని ఆయన సేవలను స్మరించుకునేలా శకటాన్ని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాధించింది. దీనిని కేంద్రం నిరాకరించింది. దీంతో మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. బెంగాల్ రాష్ట్రం ప్రతిపాదించిన శకటాన్ని రిపబ్లిక్ డే రోజున ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, నిరాకరణపై పునఃపరిశీలన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు.

ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ
పశ్చిమబెంగాల్ రాష్ట్ర శకటాన్ని నిరాకరించడంపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మమతా లేఖలో పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సుబాష్ చంద్రబోస్ 125 జయంతిని పురస్కరించుకోని ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని గుర్తు చేసేలా శకటాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా శకటాన్ని తిరస్కరించడం సరికాదని లేఖలో పేర్కొంది.

స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ ముందంజ
నేతాజీ సుబాష్ చంద్రబోస్ పాటు ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్మరించుకునేలా శకటాన్ని మమతా సర్కార్ ప్రతిపాదించింది. ఇందులో స్వామి వివేకానంద , రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, విద్యాసాగర్, మాతంగిని హజ్రా, బిర్సా ముండా, నజ్రుల్ ఇస్లాం వంటి వారి చిత్రాలను కూడా ఇందులో ఉంచినట్లు తెలిపింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ ముందంజలో ఉందని పేర్కొంది. ఈనేపథ్యంలో రాష్ట్ర శకటం ప్రదర్శన నిరాకరణ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ప్రధాని మోదీని లేఖలో మమతా కోరింది.

పలు రాష్ట్రాల శకటాలు తిరస్కరణ
గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల శకటాలను కూడా కేంద్రం తిరస్కరించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని నిరాకరించింది. కేంద్రంప్రభుత్వం ఆది శంకారాచార్యపై శకటాన్ని రూపొందించాలని కోరగా.. కేరళ సర్కార్ మాత్రం శ్రీ నారాయణ గురు థీమ్ పై పట్టుబట్టింది. సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురు , జటాయు పార్క్ స్మారక చిహ్నంపై కేరళ పంపిన ప్రతిపాదనలను మోదీ సర్కార్ తిరస్కరించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొనే విధంగా ఉండకపోవడం దురదుష్టకరమన్నారు టీఎంసీ ఎంపీ సౌరత్ రాయ్.. గత ఏడాది కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా కారణం చెప్పకుండా తమ రాష్ట్ర శకటాలను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications