westbengal exit poll results 2021: బెంగాల్‌ల్లో మళ్లీ దీదీ- ఎన్టీటీవీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్జాయి. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి హోరాహోరీగా సాగి పోరులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అతి కష్టం మీద అధికారం నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా విపక్షానికే పరిమితం కాబోతోంది.
Recommended Video

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉన్నాయి. ఇందులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 149 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నట్లు ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. బెంగాల్లో అధికారం చేపట్టాలంటే 148 సీట్లు అవసరం. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ మాత్రం 131 సీట్లకే పరిమితం కానుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. లెఫ్ట్ కూటమికి 15 సీట్లు దక్కబోతున్నాయి.

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో హోరాహోరీ పోరాడి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో మమతకు ఉన్న పట్టును బీజేపీ అదిగమించలేకపోయినట్లు తాజా అంచనాలు చెప్తున్నాయి. టీఎంసీ బొటాబోటీ మెజారిటీ సాధిస్తే మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ సాయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. ఎనిమిది దశల్లో సాగిన ఎన్నికల్లో తృణమూల్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications